Manasanamaha enters Guinness Book: తెలుగు షార్ట్ ఫిలిం 'మనసామహా'కు అరుదైన గౌరవం.. ప్రపంచబాషల్లోనే టాప్!

Manasanamaha enters in the Guinness Book: తెలుగు షార్ట్ ఫిలిం ఒక అరుదైన గౌరవం అందుకుంది. తెలుగులోనే కాక ప్రపంచ భాషల్లో అత్యధిక అవార్డులు గెలుచుకున్న షార్ట్ ఫిలింగా నిలవడంతో గిన్నిస్ బుక్లో చోటు దక్కింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 26, 2022, 05:10 PM IST
Manasanamaha enters Guinness Book: తెలుగు షార్ట్ ఫిలిం 'మనసామహా'కు అరుదైన గౌరవం.. ప్రపంచబాషల్లోనే టాప్!

Manasanamaha enters in the Guinness Book of World Records : ఒకప్పుడు సినిమా దర్శకత్వం చేయాలి అంటే పేరుమోసిన దర్శకుడి దగ్గర చాలా కాలం పాటు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఆ తర్వాత ఆయన దయతలిస్తే ఏదైనా హీరోతో కధ ఓకే చేయించుకుని దర్శకులుగా మారుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఎలాంటి దర్శకుడి దగ్గర పనిచేయకపోయినా కేవలం యూట్యూబ్ లో చూసి లేదా ఆన్లైన్ కోర్సులు చూసిన వారు సైతం సొంతగా షార్ట్ ఫిలిమ్స్ చేసేస్తున్నారు. అలా దీపక్ రెడ్డి అనే ఒక యువకుడు చేసిన షార్ట్ ఫిలిం ఇప్పుడు ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు దక్కించుకుంది.

దీపక్ రెడ్డి అనే దర్శకుడు రూపొందించిన మనసామహా అనే షార్ట్ ఫిలింకి విడుదలైన వాటి నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. పలువురు స్టార్లు కూడా ఈ షార్ట్ ఫిలిం చూసి అద్భుతంగా ఉందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రభ్స,  అనుశ్క్,  సుకుమార్,  గౌతం మీనన్,  ఎస్ఎస్ తమన్ వంటి వారు ఈ షార్ట్ ఫిలిం విడుదలైనప్పుడు ప్రమోట్ చేశారు. అయితే ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తెలుగులోనే కాక ప్రపంచ భాషల్లో అత్యధిక అవార్డులు గెలుచుకున్న షార్ట్ ఫిలింగా నిలిచింది. 

దీంతో ఆ విషయంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. ఈ షార్ట్ ఫిలింకి ఇప్పటిదాకా 513 అవార్డులు లభించాయి. ఈ విషయాన్ని సదరు దర్శకుడు తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. గతంలో ఈ షార్ట్ ఫిలిం సూపర్ హిట్ కావడంతో ఆయనకు వరుస అవకాశాలు వస్తున్నాయి అని కూడా ప్రచారం జరిగింది. కానీ ఆ విషయం మీద ఎలాంటి క్లారిటీ లేదు శ్రీకారం సినిమా చేసిన తర్వాత శర్వానంద్ దీపక్ రెడ్డితో కలిసి ఒక సినిమా చేస్తారని ప్రచారం జరిగింది. 

కానీ ఆ విషయం మీద మాత్రం అధికారిక ప్రకటన రాలేదు. ఏదైతేనేమి మొత్తం మీద ఇప్పుడు మన తెలుగోడు చేసిన ఒక షార్ట్ ఫిలిం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోవడం తెలుగువారందరికీ గర్వకారణం అని చెప్పాలి. ''నిచ్చన ఎక్కాలంటే భయం అమ్మా.... అనే పిల్లాడి నుండి.. ఎత్తులని చూసే భయాల్ని అధిగమించే గుణపాఠం నేర్పిన జీవితానికి.. ఇదే నా నివాళి... '' అంటూ సదరు దర్శకుడు తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 

Also Read: Upasana Konidela: అలాంటి వారందరికీ ఉచిత వైద్యం ప్రకటించిన ఉపాసన

Also Read: Keerthy Suresh's Dog in Special Flight: కుక్క పిల్ల కోసం కీర్తి సురేష్ స్పెషల్ ఫ్లైట్.. మాములుగా లేదుగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News