Alia Bhatt Pregnancy: త‌ల్లి కాబోతున్న అలియా భ‌ట్‌.. వైర‌ల్ అవుతున్న ఫోటో!

Alia Bhatt announce pregnancy news. తాను త్వరలో తల్లి కాబోతున్నట్లు బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్‌ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఆస్పత్రిలో స్కాన్‌ చేయించుకున్న ఓ ఫొటో షేర్‌ చేశారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jun 27, 2022, 01:57 PM IST
  • త‌ల్లి కాబోతున్న అలియా భ‌ట్‌
  • వైర‌ల్ అవుతున్న ఫోటో
  • 2022 ఏప్రిల్‌ 14న వివాహం
Alia Bhatt Pregnancy: త‌ల్లి కాబోతున్న అలియా భ‌ట్‌.. వైర‌ల్ అవుతున్న ఫోటో!

Alia Bhatt and Ranbir Kapoor announce pregnancy: బాలీవుడ్‌ స్టార్స్ రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌లు ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. 2022 ఏప్రిల్‌ 14న వివాహ బంధంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు. రణ్‌బీర్‌ ఇల్లు బాంద్రాలోని వాస్తులో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఐదేళ్లు ప్రేమిచుకున్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి పుస్తకమనే కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. రెండు నెలల క్రితం వివాహం చేసుకున్న రణ్‌బీర్‌-అలియా అభిమానులకు శుభవార్త చెప్పారు.

తాను త్వరలో తల్లి కాబోతున్నట్లు ఆలియా భట్‌ సోషల్ మీడియా ద్వారా స్వయంగా తెలిపారు. ఆస్పత్రిలో స్కాన్‌ చేయించుకున్న ఓ ఫొటో షేర్‌ చేసిన ఆలియా.. 'మా బేబీ త్వరలో ఈ భూమి మెడకు రానుంది' అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆలియా పోస్ట్ చేసిన ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ పోస్ట్ చుసిన ఫాన్స్, సెలబ్రిటీలు ఆలియాకు కంగ్రాట్స్‌ చెబుతున్నారు. మౌనీ రాయ్, రకుల్ ప్రీత్ సింగ్‌, క‌ర‌ణ్‌ జోహార్‌ వంటి సెల‌బ్రెటీలు రణ్‌బీర్‌-అలియా జంటకు అభినంద‌న‌లు చెప్పారు.

చిన్ననాటి నుంచి మంచి స్నేహితులైన రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌.. బ్రహ్మాస్త్ర సినిమా షూటింగ్‌ సమయంలో ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి ఈ లవ్ బర్డ్స్ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. తమ తమ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. ఖాళీ దొరికితే పబ్, పార్టీ, పెళ్లిళ్లకు జంటగా హాజరయ్యారు. 2022 నూతన సంవత్సర వేడుకలకు కూడా ఈ ఇద్దరు కలిసి విదేశాలకు వెళ్లారు. చివరకు పెద్దల సమక్షంలో వివాహ బందంతో ఒక్కటయ్యారు. 

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, బద్రీనాథ్ కి దుల్హనియా, టూ స్టేట్స్, హైవే, గల్లీభాయ్, రాజీ, గంగూబాయి కతియవాడి లాంటి హిట్ సినిమాలు  ఆలియా భట్‌ ఖాతాలో ఉన్నాయి. ఆలియా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో రామ్‌ చరణ్‌కు జోడీగా సీత పాత్రలో నటించారు. ప్రస్తుతం తన భర్తతో కలిసి బ్రహ్మాస్త్రలో ఆలియా నటిస్తున్నారు. హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌తో హాలీవుడ్‌లోకీ ఎంట్రీ ఇస్తున్నారు.   
 

Also Read: Hardik Pandya Record: చరిత్ర సృష్టించిన హార్ధిక్‌ పాండ్యా.. తొలి కెప్టెన్‌గా అరుదైన రికార్డు!  

Also Read: Cheapest Data Plan: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్‌.. అతి తక్కువ ధరలో ఏడాది పాటు అపరిమిత కాలింగ్, డేటా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x