Naga Chaitanya shares a happy photo: లవ్‌స్టోరీ మూవీతో (Love Story movie) తన కెరీర్‌లో మరో హిట్‌ అందుకున్నారు నాగచైతన్య. ఈ సినిమాలో నాగచైతన్య (Naga Chaitanya) రేవంత్‌ అనే మిడిల్‌క్లాస్‌ అబ్బాయి పాత్రతో ఆకట్టుకున్నారు. మూవీలో చైతు నటన అదిరిపోయింది. చైతన్యకు జోడీగా సాయిపల్లవి (sai pallavi) కూడా అదరగొట్టింది. తన స్టైల్‌లో న్యాచురల్‌గా నటించి మెప్పించారు సాయిపల్లవి. అయితే లవ్‌స్టోరీ ఘన విజయంపై తాజాగా నాగచైతన్య స్పందించారు. తనకు సూపర్‌హిట్‌ అందించిన టీమ్‌ మొత్తానికి ధన్యవాదాలు తెలిపారు చైతు. తాను జీవితాంతం గుర్తుంచుకొనేలా ఎన్నో మధుర జ్ఞాపకాలను లవ్‌స్టోరీ మూవీ అందించిదని అన్నారు నాగచైతన్య. ఈ మేరకు టీమ్‌తో దిగిన ఓ ఫొటోని ఆయన సోషల్ మీడియాలో (Social Media) పోస్ట్‌ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : Scary Video: చేతి కర్రతో చిరుతతో పోరాటం.. ప్రాణాలు కాపాడుకున్న వృద్దురాలు


కుల వ్యవస్థ, అమ్మాయిలను కుటుంబసభ్యులే వేధింపులకు గురి చేయడం వంటి సున్నితమైన అంశాలతో లవ్‌స్టోరీ మూవీ తెరకెక్కింది. శేఖర్‌ కమ్ముల (sekhar kammula) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో చైతు..జుంబా ట్రైనర్‌గా మెప్పించారు. ఇక బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్న అమ్మాయిగా సాయిపల్లవి (sai pallavi) కూడా అద్భుతంగా నటించారు. పవన్‌ మ్యూజిక్‌ ఈ మూవీకి హైలెట్. ఇలా ఎన్నో విశేషాలున్న మూవీ కాబట్టే చైతన్య కూడా తాను జీవితాంతం గుర్తుంచుకొనేలా ఎన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చిందంటూ లవ్‌స్టోరీ టీమ్‌ను (Love story) ప్రశంసించాడు.

 


Also Read : కర్ణాటకలో దారుణం.. 20కిపైగా వానరాలు మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook