Id go to the theatre 20 times to watch Sai Pallavi dance in Lovestory moive.. Rahul Ravindran: నాగచైతన్య-సాయిపల్లవి (Sai Pallavi) జంటగా నటించిన లవ్‌స్టోరీ మూవీకి (Lovestory) ఇప్పుడు మంచి ఆదరణ లభిస్తోంది. శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వం వహించిన ఈ మూవీలో సాయిపల్లవి డ్యాన్స్‌కి, నటనకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. పెద్దపెద్ద స్టార్స్ కూడా సాయిపల్లవి నటనను మెచ్చుకుంటున్నారు. అయితే తాజాగా ఈ చిత్రాన్ని చూసిన నటుడు రాహుల్ కూడా సాయిపల్లవిపై ప్రశంసలు కురిపించాడు. ఆమెను ఆకాశానికి ఎత్తేశాడు. సాయిపల్లవి డ్యాన్స్ అదిరిపోయిందంటూ మెచ్చుకున్నాడు రాహుల్ (Rahul). కేవలం సాయిపల్లవి డ్యాన్స్ చూసేందుకే తాను 20సార్లకు పైగా థియేటర్‌కి వెళ్లానని చెప్పుకొచ్చారు రాహుల్.
అంతేకాదు.. సాయిపల్లవి డ్యాన్స్‌తోనే ఓ పూర్తిస్థాయి సినిమాని ఎవరైనా తెరకెక్కిస్తే బాగుంటుందని తను అభిప్రాయం చెప్పాడు. ఆ సినిమాకి అసలు ఎలాంటి కథ కూడా అవసరం లేదన్నాడు రాహుల్. సాయిపల్లవి డ్యాన్స్ (sai pallavi dance) కోసమే తాను 20 సార్లు థియేటర్‌లో లవ్‌స్టోరీ మూవీ చూశానని రాహుల్ రవీంద్రన్ ట్వీట్ చేయగా.. సాయి పల్లవి కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.
Also Read : Online Gold: కేవలం రూ.100 కే బంగారం.. ఎగబడుతున్న జనం
రాహుల్ ప్రశంసలు తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చినట్లు సాయిపల్లవి పేర్కొన్నారు. కుల వ్యవస్థ, అమ్మాయిలపై కుటుంబసభ్యులే ఆఘాయిత్యాలకు పాల్పడుతున్నారనే సున్నితమైన విషయాన్ని శేఖర్ కమ్ముల లవ్‌స్టోరీ (Lovestory) మూవీలో చాలా చక్కగా చూపించారు. ఇందులో నాగచైతన్య (naga chaitanya) నటనతో పాటు సాయిపల్లవి డ్యాన్స్, నటనకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
Also, I hope someone makes a film with Pallavi just dancing to different songs for two hours straight. No story, nothing needed. Just her dancing. I’d watch it 20 times in a theatre. It’s needed for posterity.
— Rahul Ravindran (@23_rahulr) September 28, 2021
Also Read : Genelia: వల్గర్ ఆంటీ అంటూ జెనీలియాపై ట్రోలింగ్.. ఘాటుగా స్పందించిన జెనీలియా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook