MAA Elections 2021 Results: `అసోసియేషన్ భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నా`..: నాగబాబు
Nagababu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాల అనంతరం ‘`మా`’ ప్రాథమిక సభ్యత్వానికి మెగా బ్రదర్ నాగబాబు రాజీనామా చేశారు. ఈ లేఖను ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఆ లేఖలో ఏం పేర్కొన్నారంటే..
MAA Elections 2021 Results: 'మా' అధ్యక్ష ఎన్నిక(MAA Elections 2021)ల్లో ప్రకాశ్ రాజ్ పై మంచు విష్ణు(Manchu Vishnu) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ప్రకాశ్ రాజ్(Prakash Raj)కు మద్దుతు ఇచ్చిన మెగా బ్రదర్ నాగబాబు(Naga Babu) ‘'మా'’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం విధితమే. ‘‘ప్రాంతీయ వాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కొనసాగడం నాకు ఇష్టం లేక ‘'మా'’ అసోసియేషన్‌లో నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను... సెలవు’’ అంటూ ట్వీట్ చేశారు. అలాగే 48 గంటల్లో తన రాజీనామా లేఖను ‘మా’ కార్యాలయానికి పంపిస్తానని కూడా ఆయన స్పష్టం చేశారు.
Also Read: MAA Elections: ‘మా’ ఎన్నికల ఫలితాలపై అనసూయ కామెంట్స్..
రాజీనామా లేఖ షేర్ చేసిన నాగబాబు
సోమవారం రాత్రి నాగబాబు తన రాజీనామా లేఖను సోషల్ మీడియా(Social Media) వేదికగా షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘'మా'’ అసోసియేషన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తను రాజీనామాకు గల కారణాలకు కూడా ఆయన వివరణ ఇచ్చారు. ‘‘నిష్పక్షపాతం, విభిన్నత కలిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తీరును నేను ఎప్పుడు అభిమానించేవాడిని. సంస్కృతులు, ప్రాంతాలకు అతీతంగా కళాకారులను అక్కున చేర్చుకుని ‘మా’ ఒక సొంతిళ్లుగా నిలిచేది. ఇటీవలి కాలంలో ‘'మా'’ సభ్యుల్లో అటు కళాకారులుగా ఇటు మనుషులుగా అనూహ్య మార్పులు వచ్చాయి. ఈ అసహ్యకరమైన మార్పులు ఆశ్చర్యానికి గురిచేశాయి’’ అన్నారు.
అలాగే ‘ఈ ఎన్నికలు నాలాంటి వారికి కనువిప్పు కలిగించాయి. బలగం, ధన ప్రభావంతో అసోసియేషన్ సభ్యులు దారుణంగా దిగజారిపోయాయి. ఇలాంటి హిపోక్రైట్స్, స్టీరియోటైప్ సభ్యుల కారణంగానే నేను అసోసియేషన్ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నాం. అయితే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే వ్యక్తి ప్రకాశ్ రాజ్(Prakash Raj). అలాంటి వ్యక్తి వెంటే నేను ఎల్లప్పుడూ నిలబడి ఉంటాను. ఎప్పటికి నా మద్దతు ప్రకాశ్ రాజ్‌కే. గత పరిణామాల పట్ల నేను బాధపడటం లేదు. అసోసియేషన్ భవిష్యత్‌పైనే ఆందోళన చెందుతున్నా’ అంటూ నాగబాబు తన రాజీనామా లేఖలో రాసుకొచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook