MAA Elections 2021 Anasuya raises doubts over the result why Results Changed Overnight: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) (Movie Artists association) ఎన్నికల ఫలితాలపై యాంకర్ అనసూయ (Anasuya) అనుమానం వ్యక్తం చేశారు. అదేంటీ మొదట గెలిచానని చెప్పి.. ఇప్పుడు ఓడిపోయానని ఎలా ప్రకటించారు అని పేర్కొంది.
రాత్రికి రాత్రే ఏమైందబ్బా
అయినా రాత్రికి రాత్రే ఏమైందబ్బా అంటూ అనసూయ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎలక్షన్స్ రూల్స్‌కి భిన్నంగా బ్యాలెట్ పేపర్లను ఇంటికి తీసుకెళ్లారా ఏంటి? అంటూ అనుమానం వ్యక్తం చేసింది. తాజాగా జరిగిన మా ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ (Prakash Raj) ప్యానల్ నుంచి అనసూయ భారీ మెజార్టీతో గెలిచిందంటూ మొదట వార్తలు వచ్చాయి. అయితే తుది ఫలితాల జాబితాలో విజేతల పేర్లలో అనసూయ (Anasuya) పేరు లేకపోవడంతో ఆమె షాక్‌కి గురయ్యారు.
😂 Kshaminchali.. okka vishayam gurtochi tega navvochestundi.. meeto panchukuntunna emanukovoddey..! Ninna “athadhika majority” “bhaari majority” to gelupu ani.. eeroju “lost” “otami” antunnaru.. raathriki raathri enjaruguntundabba🧐 🤔
— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 11, 2021
Also Read : Mahesh Koneru Passed Away:మరో విషాదం..గుండెపోటుతో ప్రముఖ నిర్మాత హఠాన్మరణం
బ్యాలెట్ పేపర్లని ఇంటికి కూడా తీసుకెళ్లారట
మా ఎన్నికల్లో (MAA elections) ప్రకాశ్‌రాజ్ (Prakash Raj)ప్యానెల్ నుంచి కార్యవర్గ సభ్యురాలిగా పోటీచేసిన అనసూయ చివరికి ఓటమిపాలయ్యారని స్పష్టమైంది. అయితే ‘600 ఓట్లని లెక్కించడానికి రెండో రోజుకి ఎందుకు వాయిదా వేశారని అనసూయ ప్రశ్నించారు.
Asalu unna sumaru 900 voters lo sumaru 600 chillara voters lekkimpuki rendo roju ki vaayida veyalsinanta time eduku pattindantaru?? Aha edu ardhamkaka adugutunnanu.. 🧐🤔
— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 11, 2021
మొదట గెలుపు అని చెప్పి తర్వాత ఓటమి అనడంలో మతలబు ఏంటని అడిగారు. రాత్రికి రాత్రి ఏం జరిగింది.. అలాగే బ్యాలెట్ పేపర్లని (ballot papers) ఇంటికి కూడా తీసుకెళ్లారని బయట చెప్పుకుంటున్నారు.. అంటూ అనసూయ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు సోషల్‌మీడియాలో అనసూయ (Anasuya)తన ఓటమిపై స్పందించిన నెటిజెన్స్ పోస్టులకు రిప్లై ఇచ్చారు.
Ante mari ninna yevaro election rules ki bhinnanga ballot papers ni intiki kuda teeskellarani .. aha ante bayata talku.. 🙊 nenatledu https://t.co/tAM8MVVhxV
— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 11, 2021
Also Read : Upcoming Movies: దసరాకు థియేటర్, ఓటీటీలో వచ్చే సినిమాలివే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook