Nagarjuna in Rajinikanth Coolie: అక్కినేని నాగార్జున పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన నటించబోయే సినిమా నుంచి చిత్ర బృందం ఆయన పాత్రకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసింది. పోస్టర్ ఆద్యంతం ఆకట్టుకోవడమే కాదు మాస్ లుక్ లో నాగార్జున మళ్ళీ పాత శివను గుర్తు చేస్తున్నారని చెప్పవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 అసలు విషయంలోకెళితే లోకేష్ కనగరాజు దర్శకత్వంలో రజినీకాంత్ నటిస్తున్న చిత్రం కూలీ . ఈ సినిమా రజినీకాంత్ 171వ చిత్రం రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన చిన్న గ్లింప్స్ భారీ  పాపులారిటీని అందుకున్నాయి. గతంలో ఈ సినిమాలో నాగార్జున నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి కానీ ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ చిత్ర బృందం క్లారిటీ ఇచ్చేసింది. ఇక ఈరోజు అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో నాగార్జున నటించబోతున్నట్టు తెలిపే పోస్టర్ ను  తాజాగా చిత్ర బృందం రిలీజ్ చేసింది. కూలి సినిమాలో నాగార్జున సైమన్ అనే పాత్ర చేయబోతున్నారు. నాగార్జునకు బర్తడే విషెస్ చెబుతూ ఈ పోస్టర్ను రిలీజ్ చేశారు .ఈ పోస్టర్లో నాగార్జున స్టైల్ గా కళ్ళజోడు పెట్టుకొని కుర్చీలో కూర్చొని ,చేతికి వాచ్ ధరించిన పోస్టర్ వైరల్ అవుతోంది. ఈ లుక్ లో నాగ్ చాలా సరికొత్తగా ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. 


 



దీంతో ఈ సినిమాపై మన టాలీవుడ్ ఆడియన్స్ కి కూడా ఆసక్తి పెరిగిపోయింది.మరి ఈ సినిమాలో లోకేష్ నాగార్జునను ఎలాంటి పాత్రలో చూపించబోతున్నారు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. 


నాగార్జున విషయానికి వస్తే.. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన శివ,  మాస్ వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకోవడమే కాదు ఆడియన్స్ కి కొత్త ఎంటర్టైన్మెంట్ ను అందించారు. ముఖ్యంగా తన అద్భుతమైన నటనతో మాస్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న నాగార్జున.. రొమాంటిక్ లో కూడా తన తర్వాతే ఎవరైనా అన్నట్టుగా రెచ్చిపోయారు. ముఖ్యంగా చాలామంది హీరోయిన్స్ తో జత కట్టిన ఈయన సీనియర్,  జూనియర్ తేడా లేకుండా
 ప్రతి ఒక్కరితో కూడా రొమాన్స్ చేసి ఆకట్టుకున్నారు.  అందుకే ఈయనను ఇండస్ట్రీలో నవ మన్మధుడు అని పిలుస్తూ ఉంటారు.


Also Read: Big Shock To YSRCP: జగన్‌కు షాక్‌ల మీద షాక్‌.. ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా


Also Read: Chandrababu: ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు అసహనం.. మీ వలన పరువు పోతుంది!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.