Nagarjuna Akkineni -  The Ghost : టాలీవుడ్ కింగ్ నాగార్జున సినిమాలు ఈ మధ్య సరిగ్గా ఆడటం లేదు. చివరగా బంగార్రాజు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి సీజన్ కావడం గట్టెక్కిపోయాడు. అయితే ఇప్పుడు సరికొత్త జానర్‌తో తెలుగు వారి ముందుకు రాబోతోన్నాడు.  కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్ 'ది ఘోస్ట్'.  పవర్ ఫుల్ ఇంటర్పోల్ ఆఫీసర్ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు నాగార్జున. సోనాల్ చౌహాన్ కథానాయిక. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీ నిర్మించారు.  భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న నేపధ్యంలో కింగ్ నాగార్జున  విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాలో తమహగనే వెనుక ఒక బ్యాక్ స్టొరీ వుందని అన్నాడు నాగ్. ఈ సినిమాలో వుండదు కానీ తమహగనే వెపన్ వెనుక చాలా ఆసక్తికరమైన కథ చెప్పాడట దర్శకుడు ప్రవీణ్. అది నచ్చి దాన్ని గ్లింప్స్ గా వదిలామని తెలిపాడు. ఈ సినిమా విజయం సాధిస్తే ఆ బ్యాక్ స్టొరీ కూడా చూపిస్తాం అంటూ సీక్వెల్ మీద హింట్ వదిలాడు. 


ది ఘోస్ట్ కథలో చక్కని ఫ్యామిలీ లైన్ వుందని నాగ్ అన్నాడు. సిస్టర్, బ్రదర్ బాండింగ్ బావుంటుంది, తన సిస్టర్, ఫ్యామిలీని కాపాడటానికి హీరో చేసే పోరాటం చాలా నచ్చిందని తెలిపాడు. తాను ఎప్పుడూ కొత్తదనాన్ని ఇష్టపడతానని, ప్రవీణ్ సత్తారు ఈ కథని చాలా కొత్తగా ప్రజంట్ చేశారని మెచ్చుకున్నాడు. యాక్షన్ సీక్వెన్స్ లు, బ్రదర్ సిస్టర్ బాండ్ ని అద్భుతంగా చూపించారని కొనియాడాడు. సినిమా చూసిన తర్వాత షాక్ అయ్యానని తెలిపాడు


ఘోస్ట్ సినిమాను అందరూ కూడా శివతో పోల్చుతున్నారు.. నిజానికి ఈ సినిమా కథ విన్నప్పుడు కానీ చేసినప్పుడు కానీ ఆ పోలిక రాలేదని అన్నాడు. సినిమా చూస్తున్నపుడు మాత్రం శివ లాంటి ఫ్యామిలీ ఎమోషన్ వుందనిపించిందని నాగ్ అన్నాడు. 
తాను ఇది వరకు చాలా యాక్షన్ మూవీస్ చేశానని,  కానీ ఎమోషన్ తో కూడిన ఒక స్టయిలీష్ యాక్షన్ సినిమా చేయాలని వుండేదట. గరుడ వేగలో ప్రవీణ్ సత్తారు యాక్షన్ చాల నచ్చిందని,  ఆయన్ని పిలిచి మంచి యాక్షన్ మూవీ చేద్దామని చెప్పాడట నాగ్. అప్పుడు తనను మైండ్‌లొ పెట్టుకొని ది ఘోస్ట్ కథని తయారు చేసాడట. 


 చిరంజీవి గాడ్ ఫాదర్, తన సినిమా ఒకే తేదీని రావడంపై నాగ్ స్పందించాడు. తాము మంచి స్నేహితులమని అన్నాడు. రెండు సినిమాలు విడుదలై విజయం సాధించిన సందర్భాలు అనేకం వున్నాయని తెలిపాడు. సినిమా బావుంటే ప్రేక్షకులు ఖచ్చితంగా చూస్తారని ధీమా వ్యక్తం చేశాడు. శివ సినిమా అక్టోబర్ 5నే వచ్చింది. నిన్నే పెళ్ళాడుతా అక్టోబర్ 4న వచ్చిందని ఒక అభిమాని ఫోన్ చేసి చెప్పాడట. ది ఘోస్ట్ అక్టోబర్ 4నే  యుఎస్ లోరిలీజ్ అవుతుంది. ఈ రకంగా నిన్నే పెళ్ళాడుతా సెంటిమెంట్ కూడా కుదిరింది అని అన్నాడు నాగ్.


Also Read : GodFather టైటిల్ పెట్టింది అతనా?


Also Read : Allu Arjun - Ram Charan : రా రా.. రా పక్కన కూర్చోరా!.. వీడియో వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook