Bigg Boss Telugu 6: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 (Bigg Boss Telugu 5) ఇటీవల ముగిసింది. వీజే సన్నీ విజేతగా నిలవగా...యూట్యూబర్ షణ్ముఖ్ రన్నరప్ గా నిలిచాడు. అయితే సీజన్ ఫినాలే రోజు బిగ్ బాస్ సీజన్ 6 (Bigg Boss Telugu 6) గురించి హింట్ ఇచ్చేశారు నాగార్జున(Nagarjuna). మరో రెండు నెలల్లో మెదలువుతుందని ప్రకటించారు నాగ్. అయితే ఆరో సీజన్ కు ఎవరు హోస్ట్ గా వ్యవహారిస్తారనే విషయంపై నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. వచ్చే సీజన్ కు వ్యాఖ్యాతగా నాగార్జునను తప్పించి.. మరో స్టార్‌ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)ను రంగంలోకి దింపుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఈ రూమర్లపై నాగార్జున క్లారిటీ ఇచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండు నెలల్లో బిగ్‌బాస్‌ ఓటీటీ వేదికగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దీనికి తానే హోస్టింగ్‌ చేయనున్నట్లు డిస్నీ+హాట్‌స్టార్‌ నిర్వహించిన ప్రెస్‌మీట్‌ (Hotstar Press Meet)లో నాగార్జున స్వయంగా వెల్లడించారు. 'బిగ్‌బాస్‌ తెలుగు.. ఇండియాలోనే కాదు,  ప్రపంచ వ్యాప్తంగా నెంబర్‌1 షో.  వీకెండ్‌ ఎపిసోడ్‌కి సుమారు 5-6కోట్ల మంది లైవ్‌ చూశారు. దీన్ని బట్టి బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌కు ఎంతమంది అభిమానులున్నారో అర్థం చేసుకోవచ్చని నాగార్జున అన్నారు. అంతేకాకుండా 24 గంటలపాటు లైవ్‌ స్ట్రీమింగ్‌ నడిచే ఈ షో..తనకు బిగ్గెస్ట్‌ ఛాలెంజ్‌ అని కింగ్ పేర్కొన్నారు. త్వరలోనే బిగ్‏బాస్ డిజిటల్ సీజన్ ప్రారంభం కానుందని.. 24 గంటలు హౌస్ నుంచి లైవ్ ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుందని స్టార్ మా (Star MAA) హెడ్ అలోక్ తెలిపారు.


Also Read: Bigg Boss Season 6: బిగ్‌బాస్‌ హోస్ట్‌గా బాలయ్య..?? గెట్ రెడీ ఫర్ అన్‌స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook