Nagarjuna to Introduce Prasanna kumar Bezawada as Director: ఒక రకంగా టాలీవుడ్ లో అత్యధిక డైరెక్టర్లను పరిచయం చేసిన హీరోగా నాగార్జునకు పేరు ఉంది .ఆయన ఇప్పటివరకు సుమారు 20 మందికి పైగా పైగా డైరెక్టర్లను ఇంటర్వ్యూ చేశాడు. ముందుగా ఆ డైరెక్టర్స్ లిస్టు చూస్తే సంకీర్తన అనే సినిమాతో డైరెక్టర్ గీతాకృష్ణను ఇంటర్వ్యూ చేయగా, రక్షకుడు సినిమాతో ప్రవీణ్ గాంధీ అనే దర్శకుడిని, శివ సినిమాతో రామ్ గోపాల్ వర్మను, చైతన్య సినిమాతో ప్రతాప్ పోతన్ను దర్శకులుగా లాంచ్ చేయించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ తర్వాత శాంతి క్రాంతి అనే సినిమాతో వీ రవిచంద్రన్, నిర్ణయం అనే సినిమాతో ప్రియదర్శన్, జైత్రయాత్ర అనే సినిమాతో ఉప్పలపాటి నారాయణరావు, కిల్లర్ అనే సినిమాతో ఫాసిల్, క్రిమినల్ అనే సినిమాతో మహేష్ బట్, శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి అనే సినిమాతో వైవిఎస్ చౌదరి, నువ్వు వస్తావని అనే సినిమాతో విఆర్ ప్రతాప్, నిన్నే ప్రేమిస్తా అనే సినిమాతో ఆర్ఆర్ షిండే, సంతోషం అనే సినిమాతో దశరథ్, సత్యం అనే సినిమాతో సూర్యకిరణ్, మాస్ అనే సినిమాతో లారెన్స్, కేడి అనే సినిమాతో కిరణ్ కుమార్, ప్రేమ యుద్ధం అనే సినిమాతో రాజేంద్ర బాబు, సోగ్గాడే చిన్నినాయన అనే సినిమాతో కళ్యాణ్ కృష్ణ, ఇక తాజాగా వైల్డ్ డాగ్ అనే సినిమాతో అహిషోర్ సాల్మన్ అనే వారిని నాగార్జున డైరెక్టర్లుగా మార్చారు.


ఇక ఆ తర్వాత వారిలో కొంతమంది మాత్రమే నిలదొక్కుకోగా మిగతా వాళ్ళందరికీ ఒక అవకాశం ఇచ్చిన వాడిగా నాగార్జున నిలిచారు. అయితే అసలు విషయం ఏమిటంటే నాగార్జున ఇప్పుడు మరో కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చివరిగా ది ఘోస్ట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున ఆ తర్వాత ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అనే విషయం మీద ఇప్పటివరకు అప్డేట్ లేదు. అయితే త్వరలోనే ఒక పీరియాడిక్ జానర్ లో మూవీ చేయబోతున్నాడని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఆ కొత్త దర్శకుడు మరెవరో కాదు, అనేక సినిమాలతో రచయితగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు బెజవాడ ప్రసన్న.


నేను లోకల్, సినిమా చూపిస్తా మామ లాంటి సినిమాలతో రైటర్ గా మంచి పేరు తెచ్చుకున్న ప్రసన్నకుమార్ రైటర్ గానే సుమారు ఒక్కో సినిమాకి రెండు కోట్ల దాకా రెమ్యూనరేషన్ అందుకుంటూ వస్తున్నాడు. అలాంటి ఆయన డైరెక్ట్ గా మారాలని నిర్ణయించుకుని ఒక పీరియాడిక్ జానర్ మూవీ స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని నాగార్జున వద్దకు తీసుకెళ్లడంతో దానికి నాగార్జున ఫిదా అయ్యారని, వీలైనంత త్వరలో ప్రాజెక్టు ప్రారంభిద్దామని ప్రసన్నకుమార్ కు మాటిచ్చారని తెలుస్తోంది. అలా ప్రసన్నకుమార్ నాగార్జున కెరీర్ లో నాగార్జున పరిచయం చేస్తున్న 21వ డైరెక్టర్ గా నిలవబోతున్నాడు.


Also Read: Aishwarya Lekshmi Abused: గుడికని వెళితే అక్కడ చెయ్యేశాడు.. నరకం చూశా!


Also Read: లక్కీ ఛాన్స్ కొట్టేసిన కుర్ర హీరోయిన్.. దెబ్బకు బాలయ్య సినిమా ఛాన్స్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook