Aishwarya Lekshmi Abused: గుడికని వెళితే అక్కడ చెయ్యేశాడు.. నరకం చూశా.. హీరోయిన్ ఎమోషనల్!

Aishwarya Lekshmi Child Abuse : తన చిన్నప్పుడు లైంగిక వేధింపులకు గురయ్యానని ఐశ్వర్య లక్ష్మీ వెల్లడించారు, తన తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆమె బయట పెట్టింది. ఆ వివరాల్లోకి వెళితే   

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 6, 2022, 07:04 PM IST
Aishwarya Lekshmi Abused: గుడికని వెళితే అక్కడ చెయ్యేశాడు.. నరకం చూశా.. హీరోయిన్ ఎమోషనల్!

Aishwarya Lekshmi Reveals Her Child Abuse Phase: మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి ఇటీవలే మట్టి కుస్తీ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తమిళంలో రూపొందిన ఘట్టా కుస్తీ అనే సినిమాని తెలుగులో మట్టి కుస్తీ పేరుతో రిలీజ్ చేశారు. నిజానికి ఈ సినిమా రిలీజ్ కావడం కంటే ముందే ఆమె గాడ్సే అనే మన తెలుగు సినిమాలో కీలక పాత్రలో నటించింది. 

ఆ సినిమాలో సత్యదేవ్  సరసన ఆమె హీరోయిన్గా నటించింది. అయితే ఆ సినిమా ద్వారా ఆమెకు పెద్దగా గుర్తింపు అయితే దక్కలేదు ఆ తర్వాత అమ్ము అనే సినిమా ద్వారా కూడా ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాస్తవానికి కేరళలో పుట్టి పెరిగిన ఆమె హీరోయిన్ అవడం కంటే ముందే ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఆ తర్వాత అనుకోకుండా సినీ రంగంలోకి ప్రవేశించిన ఆమె తొలుత మలయాళం తర్వాత తమిళ సినిమాలు ఎక్కువగా చేస్తూ వచ్చింది. ఎంబిబిఎస్ పూర్తి చేసిన ఆమె నటన మీద ఆసక్తితో ముందుగా మోడలింగ్ ని కెరియర్గా ఎంచుకుంది. అలా కేరళలో అనేక యాడ్ ఫిలిమ్స్ లో కూడా ఆమె కనిపించింది.

తర్వాత ఒక మలయాళ సినిమాలో ఆమెకు ఆఫర్ రావడంతో ఆ సినిమా ద్వారా ఆమె మలయాళ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. అలా ఎంట్రీ ఇచ్చిన రెండు మూడేళ్ల వ్యవధిలోనే సుమారు అరడజనుకు పైగా సినిమాలు చేసింది. ఆ తర్వాత యాక్షన్ అనే సినిమాతో తమిళ సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె తర్వాత ధనుష్ సరసన ఏకంగా జగమే తంత్రం అనే సినిమాలో కూడా కీలకపాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది.

అయితే తన చిన్ననాటి సమయంలో లైంగిక వేధింపులకు గురయ్యాననే విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించింది. తాను చిన్నప్పుడు కేరళలోని గురువాయూర్ ఆలయానికి వెళ్ళినప్పుడు ఒక యువకుడు తన ప్రైవేట్ భాగాలను తాకి దురుసుగా ప్రవర్తించాడని ఆమె గుర్తు చేసుకున్నారు, ఆరోజు తాను పసుపు బట్టలు వేసుకోవడం ఇంకా గుర్తుందని అప్పటి నుంచి పసుపు బట్టలు వేసుకోవాలంటేనే భయం వేసేదని ఆమె చెప్పుకొచ్చారు.

అయితే అప్పటి పరిస్థితి ఇప్పుడైతే లేదని ఇప్పుడు కాస్త లోకానికి ఎక్స్పోజ్ కావడంతో ఇలాంటి విషయాల మీద అవగాహన పెంచుకున్నాను అని ఆమె చెప్పుకొచ్చారు. ఇక పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఒక కీలకపాత్రలో కనిపించిన ఆమె దానికి కొనసాగింపుగా రూపొందుతున్న సెకండ్ పార్ట్ లో కూడా అదే పాత్రలో కనిపించబోతోంది. అలాగే మలయాళంలో క్రిస్టోఫర్, కింగ్ ఆఫ్ కొత్త అనే రెండు సినిమాల్లో ఆమె నటిస్తోంది. మొత్తం మీద ఐశ్వర్య లక్ష్మి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

Also Read: Yashoda Ott Release: కోర్టు కేసులు క్లియర్.. ఆరోజే ఓటీటీలో యశోద మూవీ !  

Also Read: లక్కీ ఛాన్స్ కొట్టేసిన కుర్ర హీరోయిన్.. దెబ్బకు బాలయ్య సినిమా ఛాన్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News