Telugu Actresses Quit Acting: పెళ్లి తరువాత నటనకు దూరమైన హీరోయిన్లు వీరే!
Actresses quit acting after marriage: పెళ్లయిన హీరోయిన్ ని తమ సినిమాలోకి తీసుకోవడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించరు, అలా పెళ్ళయి నటనకు దూరమైన వారి జాబితా మీకోసం
Actresses who quit acting after marriage: సినిమాలో హీరో హీరోయిన్లకు సమాన ప్రాధాన్యత ఉంటుందని అంటూ ఉంటారు కానీ రియల్ లైఫ్ లో వచ్చేసరికి అది మారిపోతూ ఉంటుంది. హీరోలకు 60, 70 ఏళ్ళు వస్తున్నా వాళ్ళు హీరోలుగానే కొనసాగుతూ ఉంటారు కానీ హీరోయిన్ కి ఒక్కసారి వివాహం అయిందంటే ఇక వారి కెరీర్ అక్కడితో ముగిసి పోవాల్సిందే. ఎందుకంటే పెళ్లయిన హీరోయిన్ ని తమ సినిమాలోకి తీసుకోవడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించరు. అలాగే కొందరు హీరోయిన్లు పెళ్లి అయింది కదా ఎందుకులే సంసార బాధ్యతలు తీసుకుందామని పూర్తిగా ఇంటికే పరిమితం అవుతూ ఉంటారు.
అలాంటి కొందరు హీరోయిన్ల గురించి ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా ఈ లిస్టులో చెప్పుకోవాలంటే ఆసిన్ గురించి చెప్పుకోవాలి. ఆమె తెలుగు సహా బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించింది. మైక్రోమ్యాక్స్ సంస్థ కో ఫౌండర్ రాహుల్ శర్మను 2016 లో వివాహం చేసుకున్న ఆమె పూర్తిగా సినిమాలకు దూరం అయిపోయింది. ఒక రకంగా పెళ్లికి ముందే ఆమె అన్ని కమిట్మెంట్లను పూర్తి చేసుకుని పూర్తిగా సినిమాలకు దూరమైంది. ఇక తర్వాత మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ కూడా వివాహానికి ముందు పలు సినిమాల్లో హీరోయిన్గా నటించింది. కానీ మహేష్ బాబుతో ప్రేమలో పడి వివాహం చేసుకున్న తర్వాత ఆమె పూర్తిగా తన నటనా ప్రస్తానానికి పుల్ స్టాప్ పెట్టింది.
తన భర్త సినిమాల నిర్మాణంలో ఆమె ఇప్పుడు పాల్గొని స్వయంగా ఇప్పుడు కొన్ని వ్యాపారాలు కూడా నిర్వహిస్తోంది. ఇక సూర్య భార్య జ్యోతిక సైతం సూర్యను వివాహం చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పింది. అయితే 13 ఏళ్లు తరువాత రీఎంట్రీ ఇచ్చిన ఆమె పూర్తిస్థాయిలో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. ఇక మాజీ ముఖ్యమంత్రి కుమారుడుని వివాహం చేసుకున్న జెనీలియా డిసౌజా కూడా పెళ్లికి ముందు సౌత్ స్టార్ హీరోయిన్ గా ఉండేది.
కానీ పెళ్లయిన తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితమైంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో రీఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. భూమికా చావ్లా కూడా వివాహమైన తర్వాత పూర్తిస్థాయిలో సినిమాలకు దూరమైపోయింది. కానీ ఈమధ్య కాలంలో ఆమె కొన్ని సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వదిన, తల్లి పాత్రలు చేస్తూ ముందుకు వస్తోంది. అలాగే హీరో అజిత్ ను వివాహం చేసుకున్న తర్వాత శాలిని కూడా పూర్తిస్థాయిలో సినిమాలకు దూరమైపోయింది. ఒకప్పుడు మలయాళ సినీ పరిశ్రమలో లీడ్ యాక్టరెస్ గా ఉన్న ఆమె వివాహం జరిగిన తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోయి భర్త పిల్లలు చూసుకోవడం మొదలు పెట్టింది.
Also Read: Ariyana Glory Photo: అఖిల్ తొడలపై అరియానా గ్లోరీ.. దారుణమైన కామెంట్లతో ఆడుకుంటున్న నెటిజన్లు!
Also Read: Jr. NTR into AP Politics: ఏపీ రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్.. నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook