Nandamuri Balakrishna - Mahesh Babu : ఘట్టమనేని ఇంట్లో వరుసగా విషాదాలు నెలకొంటోన్న సంగతి తెలిసిందే. విజయ నిర్మల, రమేష్‌ బాబు, ఇందిరా దేవీల మరణంతో మహేష్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ కుంగిపోయారు. తన తల్లి ఇందిరా దేవీ మరణించడంతో మహేష్‌ బాబు శోక సంద్రంలో మునిగిపోయాడు. తన నానమ్మ చనిపోవడంతో సితార అయితే వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఇక ఇందిరా దేవీ (సెప్టెంబర్ 28)న మరణించిన సంగతి తెలిసిందే. నేడు ఆమె దశదిన కర్మను నిర్వహించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో టాలీవుడ్ సెలెబ్రిటీలు ఇందిరమ్మకు శ్రద్దాంజలి ఘటించారు. టాలీవుడ్ దర్శక నిర్మాతలంతా కూడా మహేష్ బాబు ఇంటికి క్యూ కట్టారు. బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సీ కళ్యాణ్‌, కేఎల్ నారాయణ, బండ్ల గణేష్ ఇలా అందరూ ఇందిరమ్మకు నివాళి అర్పించారు. నందమూరి బాలకృష్ణ కూడా ఇందిరమ్మకు శ్రద్దాంజలి ఘటించారు.


 



అనంతరం మహేష్‌ బాబుతో బాలయ్య ముచ్చటించాడు. దుఃఖం నుంచి బయటకు తీసుకొచ్చేలా ధైర్యాన్ని చెప్పినట్టుకనిపిస్తోంది. బాలయ్య, మహేష్ బాబు కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆహాలో బాలయ్య చేసిన అన్ స్టాపబుల్ షోలో మహేష్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే.


 



మామూలుగా అయితే మహేష్ బాబు ప్రస్తుతం SSMB 28 షూటింగ్‌లో పాల్గొనాల్సింది. కానీ తన తల్లి మరణంతో అన్ని షెడ్యూల్‌లను రద్దు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ అక్టోబర్ చివరి వారంలో ఉండబోతోన్నట్టుగా సమాచారం అందుతోంది.


 



ఆల్రెడీ త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదటి షెడ్యూల్లో మహేష్ బాబు దుమ్ములేపిన సంగతి తెలిసిందే. ఫైట్ మాస్టర్ అన్బరివ్ ఆధ్వర్యంలో మహేష్ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ చేశారని నిర్మాత నాగ వంశీ ట్వీట్ వేసిన సంగతి తెలిసిందే.


Also Read : Manchu Manoj Second Marriage : ఎవడి దూల వాడిది.. మంచు లక్ష్మీ రియాక్షన్


Also Read : Mohan Raja Father : లూసిఫర్‌ కంటే ‘గాడ్‌ఫాదర్‌’ చాలా బాగుందట


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook