Balakrishna, Gopichand Malineni movie NBK 107 Title and Teaser Out Today: 'సింహ' సినిమాతో సక్సెస్ బాట పట్టిన నందమూరి బాల‌కృష్ణ వరుస విజయాలు అందుకుంటున్నారు. లెజెండ్, గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వసూల్ లాంటి విజయాలు ఖాతాలో వేసుకున్నారు. గతేడాది 'అఖండ' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు బాలయ్య బాబు. ఇదే జోరును నందమూరి నటసింహం త‌న తదుపరి సినిమాలో కూడా కంటిన్యూ చేస్తున్నారు. ప్ర‌స్తుతం గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం (ఎన్‌బీకే 107) షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రవారం (జూన్ 10) బాల‌కృష్ణ పుట్టినరోజు. దాంతో ఇప్పటినుంచే నందమూరి అభిమానులు బాలయ్య బాబు పుట్టినరోజు వేడుకలలో బిజీబిజీగా ఉన్నారు. ఈ సంద‌ర్భంగా త‌న అభిమానుల‌కు బాల‌కృష్ణ ఓ సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయ్యారట‌. ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేని డైరెక్ష‌న్‌లో తెరకెక్కుతున్న ఎన్‌బీకే 107 మూవీ టైటిల్‌ను ప్ర‌క‌టిచండంతో పాటు టీజ‌ర్‌ను కూడా లాంఛ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ఓ ట్వీట్ ద్వారా తెలిపింది. 


గోపిచంద్ మ‌లినేని, బాల‌కృష్ణ సినిమాకు 'మాచర్ల' అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ చేసిన ట్వీటులో మైలురాయిపై మాచర్ల అని రాసుంది. ఇక టీజ‌ర్‌ను ఈరోజు సాయంత్రం 6 గంటల 11 నిమిషాలకు విడుదల చేయనున్నారు. దీంతో పాటు అనిల్ రావిపూడితో చేయ‌బోయే సినిమా టైటిల్‌ను కూడా రోజు ప్ర‌క‌టించ‌నున్నారని తెలుస్తోంది. ఈ రెండు సినిమాల‌కు ప‌వ‌ర్ ఫుల్ టైటిల్స్ ఉండ‌బోతున్నాయని టాక్. అభిమానుల‌కు డ‌బుల్ బొనాంజా అనే చెప్పాలి.



ఎన్‌బీకే 107లో బాలకృష్ణ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారని ఫిల్మ్ నగర్ టాక్. అందులో ఒక బాలకృష్ణ 'అన్నగారు' అని, మరో బాలకృష్ణ మోడ్రన్ లుక్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాల‌కృష్ణ‌కు జోడీగా శృతి హాస‌న్ న‌టిస్తున్నారు. క‌న్న‌డ నటుడు దునియా విజ‌య్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సాయిమాధ‌వ్ బుర్రా మాట‌లు అందిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్‌ థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. 


Also Read: Nayanthara-Vignesh Shivan: కాబోయే భార్య నయనతారకు విఘ్నేష్ స్పెషల్ ట్రీట్.. బుజ్జగించి మరీ..!  


Also Read: YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో సంచలనం.. సాక్షి అనుమానాస్పద మృతి  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook