YS Viveka Murder Case: ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా నిలిచిన సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం జరిగింది. వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. అనంతపూర్ జిల్లా యాడిలోని తన స్వగృహంలో నిద్రలోనే కన్నుమూశార గంగాధర్ రెడ్డి. బుధవారం రాత్రి పడుకున్న గంగాధర్ రెడ్డి... గురువారం ఉదయం నిద్ర లేవలేదు. కుటుంబ సభ్యులు లేపడానికి ఎంతగా ప్రయత్నించినా స్పందించలేదు. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు వైద్యులను తీసుకొచ్చారు. గంగాధ్ రెడ్డిని పరీక్షించిన వైద్యులు.. పల్స్ రేటు పడిపోవడంతో చనిపోయినట్లు నిర్ధారించారు.
గంగాధర్ రెడ్డి మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఇంటికి వచ్చిన పోలీసులు కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్నారని.. అనారోగ్యంతోనే గంగాధర్ రెడ్డి చనిపోయారని కుటుంబ సభ్యులు చెప్పారు. పోలీసులు మాత్రం వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్ రెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ మందకొడిగా సాగుతుందనే విమర్శలు ఉన్నాయి. కాని ఇటీవలే మళ్లీ స్పీడ్ పెంచారు సీబీఐ అధికారులు. కొన్ని రోజులుగా పులివెందులలోనే మకాం వేశారు.ఈ కేసులో కీలకంగా ఉన్న దస్తగిరి, ఇనయతుల్లా ఇచ్చిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి నివాసంతో పాటు అనుమానితుల ఇళ్లను పరిశీలిస్తున్నారు. స్థానిక రెవెన్యూ, సర్వేయర్ల నుంచి వివరాలు సేకరించారు. తొలిసారి సీఎం జగన్ ఇంటికి వెళ్లారు సీబీఐ అధికారులు. జగన్ ఇంటి కొలతలు తీసుకున్నారు. డాక్టర్ ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్, వివేకా సన్నిహితుడు ఎర్ర గంగి రెడ్డి, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ఇళ్లను పరిశీలించారు. వివేకా హత్య జరిగిన ప్రదేశాన్ని మరోమారు పరిశీలించారు. ఘటనాస్థలిలో రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. దర్యాప్తులో భాగంగా వివిధ ప్రాంతాల్లో వీడియో రికార్డింగ్ తీసింది సీబీఐ టీమ్. చాలా చోట్ల ఫోటోలు కూడా తీసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లడం సంచలనంగా మారింది. వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐ మళ్లీ మొదటి నుంచి విచారణ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది.
Read also: Gang Rape Case Update: పోలీస్ కస్టడీకి గ్యాంగ్ రేప్ కేసు నిందితుడు.. బడాబాబుల లింకులు బయటపడేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook