Ramabanam Title Poster  మాస్ హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌లది టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ కాంబినేషన్‌ అన్న సంగతి తెలిసిందే. లక్ష్యం, లౌక్యం వంటి సూపర్ హిట్లు వీరి కాంబోలో వచ్చాయి. అయితే ఇప్పుడు ముచ్చటగా మూడో సారి రాబోతోన్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టి జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి నిర్మిస్తున్నారు. గోపీచంద్ సరసన డింపుల్ హయతి నటిస్తుండగా, జగపతి బాబు, కుష్బూలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గోపీచంద్ కెరీర్‌లో 30వ సినిమాగా రాబోతోన్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం చివరి దశలోకి వచ్చింది. సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ టైటిల్‌ను ప్రకటించారు. ఈ మేరకు టైటిల్‌ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో గోపీచంద్ పాల్గొన్న సమయంలో మన నటసింహం ఓ సలహాను ఇచ్చింది. లక్ష్యం, లౌక్యం తరువాత మళ్లీ కలిసి చేస్తున్నారు కాబట్టి మీ నెక్ట్స్ సినిమాకు రామ బాణం అనే టైటిల్‌ను పెట్టుకోండని బాలయ్య సలహా ఇచ్చాడు.


[[{"fid":"259363","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


బాలయ్య ఇచ్చిన సలహాను గోపీచంద్ పాటించాడు. బాలకృష్ణ తమ చిత్రం పేరును  రామబాణంగా ప్రకటించడం తమకెంతో ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు చిత్ర దర్శకుడు శ్రీవాస్, నిర్మాతలు టి జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల. భూపతి రాజా అందించిన ఈ కథలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సామాజిక సందేశం కూడా మిళితమై ఉంటుందట. ఈ చిత్రంలో సరికొత్త గోపీచంద్‌ను చూడబోతున్నారని మేకర్లు తెలిపారు.


లక్ష్యం, లౌక్యం వంటి సినిమాల తరువాత గోపీచంద్, శ్రీవాస్ కలసి పనిచేయటంతో ఇప్పటికే అంచనాలు మొదలయ్యాయి. ఆ రెండు సినిమాలను మించేలా ఉండాలని  ఈ సినిమా ని శ్రీవాస్  ఓ బాధ్యత తో తీర్చి దిద్దుతున్నాడని తెలుస్తోంది. 2023 వేసవి కానుకగా ఈ చిత్రం రాబోతోన్నట్టుగా తెలుస్తోంది.


Also Read:  Veera Simha Reddy Review : వీర సింహా రెడ్డి రివ్యూ.. మెప్పించిన బాలయ్య, నొప్పించిన గోపీచంద్


Also Read: Vaarsudu Telugu Movie Review : విజయ్ వారసుడు రివ్యూ.. వంశీ పైడిపల్లి ఇక మారడు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి