Taraka Ratna Birth Anniversary తారకరత్న మరణించి నాలుగు రోజులు అవుతోంది. శివరాత్రి నాడు శివైక్యం అయ్యాడు. గత నెలలో కుప్పకూలిన తారకరత్న.. 23 రోజులుగా హాస్పిటల్ బెడ్డుపై కళ్లు తెరవలేని, కదల్లేని స్థితిలో ఉండిపోయాడు. లోకేష్‌ యువగళం పాదయాత్ర నాడే తారకరత్నకు ఇలా జరగడం, కుప్పం హాస్పిటల్‌కి తీసుకెళ్లడం, కండీషన్ సీరియస్ అని తెలియడం, వెంటనే బెంగళూరుకు తరలించడం అందరికీ తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తారకరత్న ఆరోగ్యం విషయంలో క్షణానికొక ట్విస్ట్ బయటకు వస్తూనే ఉండేది. ముందుగా అస్వస్థత అన్నారు.. ఆ తరువాత హార్ట్ ఎటాక్ అన్నారు.. ఆ తరువాత అది తీవ్ర స్థాయిలో వచ్చిన హార్ట్ ఎటాక్ అన్నారు.. ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నామని చెప్పారు.. వెంటిలేటర్ మీద ఉంచామని చెప్పారు.. ఇలా తారకరత్న విషయంలో ఎప్పుడూ గందరగోళం నెలకొని ఉండేది.


తారకరత్న ఎప్పుడో మరణించారని, లోకేష్ పాదయాత్రకు మచ్చ వస్తుందని దాచి పెట్టారని సోషల్ మీడియాలో ఓ వర్గం ప్రచారం చేస్తూనే వచ్చింది. అయితే తారకరత్న కోలుకుంటున్నాడని, తిరిగి వస్తాడని నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు చెబుతూ వచ్చారు. విదేశాల నుంచి వైద్యుల్నీ కూడా రప్పించారని తెలిసిందే. విదేశీ వైద్యుల పర్యవేక్షణలో తారకరత్న తిరిగి కోలుకుంటాడని అంతా అనుకున్నారు.


కానీ చివరకు తారకరత్న మహా శివరాత్రి నాడు కన్నుమూశారు. ఫిబ్రవరి 18న తారకరత్న కన్నుమూసినట్టుగా ప్రకటించారు. అయితే నాలుగు రోజుల్లో తారకరత్న పుట్టిన రోజు ఉంది.. ఇప్పుడే ఇలా తుది శ్వాస విడిచాడు.. నిండా నలభై ఏళ్లు కూడా నిండలేదు.. ఇంత చిన్న వయసులో మరణించాడు.. అంటూ తారకరత్న అభిమానులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మిస్ యూ తారకరత్న అంటూ అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. తారకరత్న పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని, ఎమ్మెల్యే అవ్వాలన్న చివరి కోరిక తీరకుండానే చనిపోవడం బాధాకరం


Also Read:  Rashmi on amberpet stray dog : కుక్కల దాడిలో పసిబిడ్డ మృతి.. కనికరం చూపించకుండా వాటికే యాంకర్ రష్మీ సపోర్ట్


Also Read: Prabhu Hospitalized : హాస్పిటల్‌లో చేరిన ప్రముఖ నటుడు ప్రభు.. కారణం ఏంటంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook