Nani Dasara and Adivi Sesh Hit 2 Movie Shootings Started: గత కొన్నాళ్లుగా తెలుగు సినిమాల షూటింగ్స్ అన్నీ నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే సుమారు 23 రోజుల పాటు అనేక రంగాలు, అనేక వర్గాల వారితో సమావేశాలు జరిపిన తర్వాత ఎట్టకేలకు మళ్లీ షూటింగ్స్ ఎప్పుడు మొదలు పెట్టాలి అనే విషయంలో క్లారిటీ వచ్చింది . ఇంకా కొన్ని సమస్యల మీద చర్చలు జరగాల్సి ఉంది. కానీ ఆ సమస్యలన్నీ కూడా త్వరలో క్లియర్ అవుతాయని, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గతంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి షూటింగులు జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు కూడా వారు వెల్లడించారు. ఒకవేళ ఎమర్జెన్సీగా షూటింగ్స్ జరుపుకోవాలని అనుకుంటే తెలియజేసి షూటింగ్ జరుపుకోవచ్చని వారు ప్రకటించారు. ఇక ఈ క్రమంలో గురువారం నుంచి రెండు సినిమాల షూటింగ్లు ప్రారంభమయ్యాయి. నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమా షూటింగ్ అలాగే అడవి శేష్ హీరోగా నటిస్తున్న హిట్ 2 సినిమాలో షూటింగులు హైదరాబాదులో ప్రారంభమైనట్లు తెలుస్తోంది.


విశ్వక్సేన్ హీరో గారు రూపొందుతున్న ఒక సినిమా షూటింగ్ గతంలో ప్రారంభమైన తర్వాత ఫిలిం ఛాంబర్ నుంచి హెచ్చరికలు రావడంతో నిలిపివేశారు. ఆ సినిమా షూటింగ్ కూడా ఈ రోజు రేపటిలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఆగస్టు 30వ తేదీన ఫిలిం ఛాంబర్ కి సంబంధించిన తుది నిర్ణయాలను సినీ పరిశ్రమకు వెల్లడిస్తామని గతంలో దిల్ రాజు ప్రకటించారు. ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లకు ఉన్న వీపీఎఫ్ సమస్యలు ఇప్పటికే పరిష్కారం అయిందని సెప్టెంబర్ రెండో తేదీ నుంచి వీపీఎఫ్ చార్జీలు వసూలు చేయడం లేదని తెలుస్తోంది అని ప్రకటించారు.


అంటే ఈ మేరకు సినీ థియేటర్ల యజమానులు, మల్టీప్లెక్స్ యజమానులతో కూడా చర్చలు జరిపారు. పెద్ద సినిమాలకు ఒక స్లాబ్ ప్రకారం చిన్న సినిమాలకు ఒక స్లాబ్ ప్రకారం టికెట్ ధరలు ఉంటాయని చెబుతున్నారు. మొత్తం మీద సినీ పరిశ్రమ మళ్ళీ పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటుంది అని దర్శక నిర్మాతలు సహా సినీ నటులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Koratala Siva New Story for Jr NTR: ఆచార్య ఝలక్... కీలక నిర్ణయం తీసుకున్న కొరటాల శివ!


Also Read: KGF Actor Harish Roy: పాపం.. కేజీఎఫ్ నటుడుకి ఎవ్వరికీ చెప్పుకోలేని కష్టం.. ఆర్థిక సాయం కోసం ఎదురుచూపులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి