Koratala Siva Scripting New Story for Jr NTR: కరోనా తర్వాత తెలుగు ప్రేక్షకుల మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. ఇతర దేశాలకు చెందిన అనేక సినిమాలను తెలుగు, తమిళ, కన్నడ భాషలకు చెందిన సినిమాలను డిజిటల్ వేదికగా వీక్షిస్తూ వారు సాధారణ సినిమాలు చూస్తే ఎక్సైట్ కావడం లేదు. ఈ నేపథ్యంలోనే కరోనా ముందు అనుకున్నా అనేక కథలు ప్రేక్షకుల ముందుకు వచ్చి బోల్తా పడ్డాయి. ఈ నేపద్యంలో ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండా ఉన్న సినిమాల దర్శకులు, నిర్మాతలు జాగ్రత్త పడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ముందు అనుకున్న కథను పక్కనపెట్టి ఎన్టీఆర్ కోసం కొరటాల శివ ఒక కొత్త సిద్ధం చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిజానికి ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ ముందుగా త్రివిక్రమ్ తో సినిమా చేయాలని అనుకున్నారు. ఏమైందో ఏమో త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో సినిమా ప్రకటిస్తే కొరటాల శివతో ఎన్టీఆర్ సినిమా ప్రకటించారు. అయితే కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో చేసిన ఆచార్య సినిమా భారీ డిజాస్టర్ గా నిలవడంతో ఎందుకైనా మంచిదని ఉద్దేశంతో ఎన్టీఆర్ తో సినిమా విషయం మీద చాలా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు.
దానికి తోడు ఈ సినిమా నిర్మాత కూడా కొరటాల శివకు అత్యంత సన్నిహితుడు మిక్కిలినేని సుధాకర్ కావడం ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ సహనిర్మాణ సంస్థగా వ్యవహరిస్తూ ఉండడంతో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక సినిమా కథ మీద మరోసారి వర్కౌట్ చేస్తున్నారని తెలుస్తోంది. ముందు అనుకున్న కథ కంటే రెండోసారి అనుకున్న కథ భారీగా ఉంటుందని కొరటాల శివ సన్నిహితులు చెబుతున్నారు.
ఇక ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పట్లో ఉండదని నవంబర్ నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఒకవేళ ఈ లోపు ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్న ప్రశాంత్ నీల్ ఆ సినిమా షూట్ పూర్తి చేసుకోగలిగితే ఎన్టీఆర్ తో సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయి అనే విషయం మీద మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read: The Ghost Trailer: అంచనాలు పెంచ్తేస్తున్న ది ఘోస్ట్ ట్రైలర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి