Saripodhaa Sanivaaram Review : హాయ్ నాన్న సినిమాతో మంచి విజయం అందుకున్న నాని.. మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సరిపోదా శనివారం చిత్రంతో ముందుకు వచ్చారు. అంటే సుందరానికి దర్శకుడు వివేక్ ఆత్రేయతో.. నాని తీస్తున్న రెండవ సినిమా కావడంతో.. ఈ చిత్రంపై ముందు నుంచి అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ క్రమంలో ఈరోజు ఆగస్టు 29న విడుదలైన ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మామూలుగా నానితో పాటు దర్శకుడు వివేక్ ఆత్రేయ సినిమాలు లైట్ హార్టెడ్‌ ఎమోష‌న్స్‌, కామెడీ క‌ల‌బోత‌గా.. చాలా క్లాస్ గా ఉంటాయి. కానీ వాటికి భిన్నంగా మాస్ యాక్ష‌న్ డ్రామాగా.. స‌రిపోదా శ‌నివారం చిత్రం సాగుతుంద‌ని నెటిజ‌న్లు ట్వీట్లు చేస్తోన్నారు. అంతేకాకుండా ట్రైలర్ లో ముందుగానే చూపించినట్టు.. నాని, ఎస్‌జే సూర్య క‌లిసి స్క్రీన్‌పై క‌నిపించే ప్ర‌తి సీస్ అదిరిపోయిందని అంటున్నారు.


సినిమా చాలా బాగుంది అని కానీ.. కొన్ని దగ్గర్ల బోర్ కొట్టించడం ఖాయం అని అంటున్నాడు. మూడు గంట‌ల ర‌న్ టైమ్ ఈ చిత్రానికి పెద్ద మైన‌స్‌గా మారింద‌ని చెబుతోన్నారు. ఫ‌స్ట్ హాఫ్‌లో నాని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌.. అలానే ప్రీ క్లైమాక్స్ సీన్స్‌ చాలా సాగ‌తీత‌గా ఉంటాయ‌ని కొంద‌రు నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తోన్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో నాని పాత్ర‌ను ప‌రిచ‌యం చేయ‌డానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడ‌ని అంటున్నారు.


ఇక సినిమాలో ట్విస్టులు ముందుగానే మనకు తెలిసిపోతాయి అని అంటున్నారు.  జేక్స్ బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా హైలైట్‌గా నిలిచింద‌ని ఓవ‌ర్‌సీస్ ఆడియెన్స్ పేర్కొన్నారు. 


 



ఇంకొకరు సినిమా గురించి చెబుతూ.. ఈ చిత్రం ఇంద్ర ల్ అమలుగా లేదని.. చాలా హై గా ఉందని.. పోతారు..మొత్తం పోతారు.. కానీ సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం బోర్ గా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. 


 



మరొకరు సినిమా కథ మామూలుగా ఉన్న ఈ చిత్రంలో నటినటులు పర్ఫామెన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరింది అంటూ కామెంట్స్ పెట్టారు.


 



Also Read: Big Shock To YSRCP: జగన్‌కు షాక్‌ల మీద షాక్‌.. ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా


Also Read: Chandrababu: ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు అసహనం.. మీ వలన పరువు పోతుంది!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook