నాని అప్‌కమింగ్ సినిమా టక్ జగదీష్ మూవీ రిలీజ్ డేట్ ఖరారైంది. దర్శకుడు శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 16వ తేదీన విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. సమ్మర్‌లో విడుదలయ్యే సినిమాల విషయంలో అయోమయాన్ని నివారించడానికే టక్ జగదీష్ చిత్రం ( Tuck Jagadish movie ) విడుదల తేదీని నిర్మాతలు ముందుగానే ప్రకటించినట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.


ఫ్యామిలీ డ్రామా నేపథ్యంతో తెరకెక్కుతున్న టక్ జగదీష్ మూవీలో నానితో ( Nani ) పాటు రితు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ ఆధ్వర్యంలో సాహు గారపతి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా షెడ్యూల్ ప్రకారం 2020 జూలైలోనే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. కరోనావైరస్, లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌ ఆలస్యం అవడంతో సినిమా సైతం అంతే ఆలస్యంగా ఆడియెన్స్ ముందుకు వస్తోంది.