Nara Chandrababu Naidu and Lokesh chief guests for Balakrishna Unstoppable Season 2: నందమూరి నటసింహం బాలకృష్ణ మొదటిసారి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సెలబ్రిటీ టాక్‌ షో 'అన్‌ స్టాపబుల్‌'. ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా' వేదికగా ప్రసారమైన ఈ షో భారీ హిట్ అయింది. మహేష్ బాబు, అల్లు అర్జున్, మోహన్ బాబు, రష్మిక, రానాలాంటి స్టార్స్ రావడంతో  ఆహా మోస్ట్‌ వాచ్డ్‌ షోగా అన్‌ స్టాపబుల్‌ గుర్తింపు తెచ్చుకుంది. అన్‌స్టాపబుల్‌ మొదటి సీజన్ సక్సెస్ కావడంతో.. రెండో సీజన్ ప్లాన్ చేసింది ఆహా యాజమాన్యం. అక్టోబర్ నుంచి రెండవ సీజన్ మొదలు కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అన్‌ స్టాపబుల్‌ షో రెండో సీజన్ మొదటి ఎపిసోడ్‌కు ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ రానున్నారని సమాచారం తెలుస్తోంది. ఏపీ రాజకీయ నాయకులు రానున్నారని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. చంద్రబాబు, లోకేష్‌లకి సంబందించిన షూట్ శనివారం జరగనుందట. ఈ ఎపిసోడ్ దసరా కానుకగా అక్టోబర్ 4 లేదా 5న ఆహాలో స్ట్రీమింగ్ కానుందట. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 


ఒకవేళ ఈ వార్త నిజమయితే.. బాలకృష్ణతో సందడి మాములుగా ఉండదు. సమయాను సందర్భంగా పంచులు వేసే బాలయ్య బాబు సొంత మనుషులతో ఎలా అల్లరి చేస్తారో చూడాలి. ఇక ఏపీలో ఎన్నికలకు చాలా సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే చంద్రబాబు రంగంలోకి దిగుతున్నారని చెప్పొచ్చు. ఈ షోలో తండ్రీకొడుకులు ఏ విషయాలపై స్పందిస్తారో అని ఫాన్స్ అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. కాంట్రవర్సరీ వివాదాలపై స్పందించే అవకాశాలు కూడా ఉన్నాయి. 


Also Read: Deepika-Ranveer Divorce: దీపికా-రణ్‌వీర్‌లు విడిపోతున్నారా.. అసలు కారణం అదేనా!


Also Read: పొన్నియన్‌ సెల్వన్‌-1లో.. మహేష్‌ బాబు రిజెక్ట్ చేసిన పాత్ర ఇదే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook