Naradan OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసిన ప్రియదర్శి క్రైమ్ థ్రిల్లర్.. టివినో థామస్ ‘నారదన్’ మూవీస్..
Naradan OTT Streaming : తెలుగులో విభిన్న కథా చిత్రాలతో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి క్రైమ్ థ్రిల్లర్ ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’. మలయాళ స్టార్ టివినో థామస్ హీరోగా నటించిన ‘నారదన్’ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
Naradan OTT Streaming :వెర్సటైల్ యాక్టర్ ప్రియదర్శి ముఖ్యపాత్రలో యాక్ట్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ 'తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి'. నిరంజన అనూప్, మణికందన్ ఆర్. ఆచారి ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. నారాయణ చెన్నా డైరెక్ట్ చేశారు.
బ్యాంక్ రాబరీ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ మూవీలో ప్రియదర్శి క్యారెక్టరైజేషన్ అందరినీ కట్టిపడేసింది. తనదైన నేచురల్ నటన, కామిక్ టైమింగ్ తో స్టోరీని ఆద్యంతం ఆకట్టుకునేలా నడిపారు నటుడు ప్రియదర్శి. ఇప్పుడీ సినిమా భవానీ మీడియా ద్వారా ఆహా ఓటీటీలో నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ మూవీతో మలయాళ స్టార్ టోవినో థామస్ లీడ్ రోల్ లో యాక్ట చేసిన మరో చిత్రం ‘నారదన్’. అన్నా బెన్, షరాఫుద్దీన్, ఇంద్రన్స్, జాఫర్ ఇడుక్కి ఇతర కీలక పాత్రలు పోషించారు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నేపథ్యంలో ప్రేరణ పొందిన ఈ చిత్రంలో న్యూస్ యాంకర్ చంద్రప్రకాష్ పాత్రలో టోవినో యాక్టింగ్ ప్రేక్షకును మెస్మరైజ్ చేస్తోంది.
నేటి TRP-బేస్డ్ మీడియా ల్యాండ్ స్కేప్‌లో నైతిక జర్నలిజం పాత్రపై నారదన్ పవర్ ఫుల్ ప్రతిబింబం. నారదన్ జర్నలిస్టులు ఎదుర్కొనే సవాళ్లను, కథల కోసం కనికరంలేని అన్వేషణ, వారి అభిరుచి కోసం చాలా మంది భరించే సవాళ్లను ఎక్సయిటింగ్ ప్రజెంట్ చేస్తోంది. మలయాళంలో విజయం సాధించిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ భవానీ మీడియా ద్వారా ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. నవంబర్ 29 నుంచి ఆహాలో ప్రసారం కానుంది. ఈ రెండో మంచి సినిమాలు ఈ వీకెండ్ లో ఎవరు మిస్ అవ్వలొద్దు.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter