రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ఇటీవలే విడుదలైన నాటు నాటు సాంగ్‌కి ఎంత క్రేజ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మాస్ బీట్‌కి అన్ని భాషల ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. నాటు నాటు పాటకి స్టెప్పులు వేస్తూ మాస్‌ఆంథెమ్ హ్యాష్ ట్యాగ్‌తో తమ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంకొంత మంది అచ్చం చరణ్, తారక్ తరహాలో ఫాస్టుగా స్టెప్పులు వేయలేక నానా తంటాలు పడుతున్నారు. దీంతో అలాంటి వారి కోసం ఏకంగా అదే పాటకు కొరియోగ్రఫీ అందించిన ఫేమస్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ రంగంలోకి దిగాడు. నాటు నాటు పాటపై స్టెప్పేయాలనుకునే వారి కోసం ప్రేమ్ రక్షిత్ ఓ ట్యుటోరియల్ వీడియోను యూట్యూబ్‌లో రిలీజ్ చేశాడు. మరి ఇంకెందుకు ఆలస్యం.. నాటు నాటు సాంగ్ డ్యాన్స్‌పై ప్రేమ్ రక్షిత్ చెబుతున్న సీక్రెట్ కిటుకులపై మీరూ ఓ లుక్కేయండి.



Also read : అర్జున ఫాల్గుణ నుంచి కాపాడేవా రాపాడేవా లిరికల్ సాంగ్ విడుదల


ప్రేమ్ రక్షిత్ షేర్ చేసిన ఈ వీడియోలో నాటు నాటు పాటకి ఎలా స్టెప్పేయాలో చూసి నేర్చుకోవచ్చు. అలియా భట్, ఒలివియా మోరిస్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగణ్, శ్రియ శరణ్, సముద్ర ఖని ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. 


డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే వీళ్లిద్దరి పాత్రలను పరిచయం చేస్తూ విడుదల చేసిన ప్రోమోలకు అభిమానుల నుంచి, ఆడియెన్స్ నుంచి భారీ స్పందన కనిపించింది. ఇక మొత్తం ఆర్ఆర్ఆర్ మూవీ ఎలా ఉండనుందా చూడాలంటే.. వచ్చే ఏడాది జనవరి 7 వ తేదీ వరకు వేచిచూడాల్సిందే.


Also read : కేటీఆర్ పోస్ట్‌పై సమంత రియాక్ట్‌, సోషల్‌ మీడియాలో వైరల్‌


Also read : మోహన్ బాబు ఇంట విషాదం.. రంగస్వామి నాయుడు మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook