చిత్రం: టక్‌ జగదీష్‌
నటీనటులు: నాని, రీతూవర్మ, ఐశ్వర్య రాజేశ్‌, జగపతిబాబు, డానియల్‌ బాలాజీ, రావు రమేశ్...తదితరులు
సంగీతం: తమన్‌, గోపీ సుందర్‌
సినిమాటోగ్రఫీ: ప్రసాద్‌ మూరెళ్ల
ఎడిటింగ్‌: ప్రవీణ్ పూడి 
బ్యానర్‌: షైన్‌ స్క్రీన్‌ ప్రొడక్షన్స్‌
నిర్మాత: సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది
కథ, స్క్రీన్‌ప్లే మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ 
విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌

 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Tuck Jagadish movie Review: భిన్నమైన పాత్రలు, విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ (Tollywood) హీరోలలో నాని (Natural Star Nani) ఒకరు. మొదటి సినిమా 'అష్ట-చమ్మ' (Astha-chamma Movie) నుండి గతేడాది విడుదలైన 'వి' (V Movie) సినిమా వరకు కొత్తదనంతో కూడిన పాత్రలు, కొత్త తరహ కథలను ఎంచుకుంటూ చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు హీరో నాని.


దర్శకుడు శివ నిర్వాణ (Director Shiva NIrvana) 'మజిలి' (Majili telugu Movie) తరువాత ఈ సినిమా చేయగా.. నాని- శివ కాంబినేషన్ (Nani-Shiva Combo) లో వచ్చిన 'నిన్నుకోరి' (Ninnu kori) సినిమా సూపర్ హిట్ తరువాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమానే "టక్ జగదీశ్"(Tuck Jagadish). కరోనా కారణంగా చాలా సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా 'V' సినిమా తరహాలోనే అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) లో విడుదలైంది. వినాయక చవితి (Ganesh Chathurthi) సందర్భంగా ఒటీటీలో (OTT) విడుదలైన ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుందో చూద్దాం...


Also Read: Old Lady Dance on Bullet Bandi Song: బుల్లెట్ బండి పాటపై 70 ఏళ్ల బామ్మ డ్యాన్స్ (Video)


కథ: 
ఆదిశేషులు నాయుడు (నాజర్‌) కు కుటుంబం అన్న, ఉండే ఊరు భూదేవిపురం అన్న అమితమైన ప్రేమ.. ఆదిశేషులుకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్లు... పెద్దకొడుకు బోసు (జగపతి బాబు) తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటాడు చిన్న కొడుకు టక్‌ జగదీష్‌ (నాని) పట్టణంలో చదువుకోసం వెళ్తాడు. తక జగదీష్‌ కు మేనకోడులు చంద్రమ్మ(ఐశ్వర్య రాజేష్‌) అంటే ప్రాణం. హఠాత్తుగా తండ్రి ఆదిశేషులు నాయుడు మరణంతో పెద్దకొడుకు బోసుకు స్వార్థం పెరిగిపోయి కుటుంబం చిన్నాభిన్నం చేసి మేనకోడలును ప్రత్యర్థి వీరేంద్రనాయుడు (డానియల్‌ బాలాజీ) తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు.ఊరికి వచ్చిన టక్‌ జగదీష్‌ ఏం చేసాడు? అన్న బోసును ఎలా మార్చాడు,? రీతు వర్మకి ఊరికి సంబంధం ఏంటి? భూ కక్షలు లేని ఊరిని చూడాలన్న తన తండ్రి కళను నేరవేర్చాడా లేదా అన్నదే కథ..


ఎలా ఉందంటే..??
అన్నదమ్ముల ఆస్తి గొడవలు.. కుటుంబంలో వచ్చిన గొడవలను మనస్పర్థాలను హీరో ఎలా తొలగించాడు అన్నదే కథాంశం. ఈ కథతో చాలా సినిమాలే వచ్చాయి. 'నిన్ను కోరి', 'మజిలీ' వంటి డిఫెరెంట్ లవ్ కథలను తెరకెక్కించి సక్సెస్ అయిన దర్శకుడు శివ నిర్వాణ మొదటి సారి కుటుంబ కథాంశంతో తెరకెక్కిన సినిమా టక్ జగదీశ్ (Tuck Jagadish). ఊళ్ళో ఉండే ఆస్తి త‌గాదాలు, కుటుంబంలో ఉండే మనస్పర్థాలు, భూ గొడ‌వ‌లు కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఎమ్మార్వో ఉద్యోగం, హీరోకి ఓ ప్రేమ కథ మరియు మేనకోడలు బాధ్యత.. ఇలా చాలా పెద్ద కథ.. కథలోని ప్రతి పాత్రకు తగిన న్యాయం చేసిన దర్శకుడు శివ ఫ్యామిలీ ఒరియెంటెడ్ సినిమా తెరకెక్కించటంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. కానీ కమర్షియల్ కంటెంట్ లేకపోవటం సినిమాకి ఒక బలహీనత...


Also Read: Ganesh Chaturthi 2021: హుస్సేన్ సాగర్‌లో PoP idols నిమజ్జనంపై హై కోర్టు కీలక ఆదేశాలు


ఎవరెలా చేసారంటే,, ??
ఎప్పటిలాగే హీరో నాని జగదీశ్ పాత్రలో జీవించేసాడు. ఇక జగపతి (Jagapathi Babu) బాబు విషయానికి వస్తే.. చాలా రోజుల తరువాత అన్నయ్య పాత్రలో చేసినా... పాత్రకు న్యాయం చేకుర్చాడు. వీఆర్వో గుమ్మడి వరలక్ష్మీ పాత్రలో రీతూవర్మ (Reetu Varma) చక్కగా ఒదిగిపోయింది. నాజర్ (Najar)కూడా పాత్రకు తగ్గట్టుగా నటించాడు. ఇక మేనకోడలు ఐశ్యర్య రాజేశ్‌ (Aishwarya Rajesh) పర్వాలేదనిపించిన... రావు రమేశ్‌ (Ravu Ramesh), నరేశ్‌ (Naresh), మాలపార్వతి (Mala Parvathi), రోహిని (Rohini), తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు. 



కుటుంబ కథాంశంగా తెరకెక్కిన ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఇక సంగీతం విషయానికి వస్తే అంతంత మాత్రమే ఉన్న పాటలు అలరించలేకపోవటం...గోపీసుందర్‌ (Gopi Sundhar) ఇచ్చిన బాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు, గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమా అంత బాగానే అనిపిస్తుంది. తెలుగులో కుటుంబ కథా చిత్రాలు వచ్చి చాలా కాలమే అయింది కాబట్టి ఈ సినిమాకి ప్లస్ పాయింట్ మరియు అమెజాన్ ప్రైమ్ లో సినిమా అందుబాటులో ఉండటం మరొక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. 


Also Read: Ram Charan: వైరల్‌గా రామ్ చరణ్‌ వాచ్‌..ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!


గమనిక:
రివ్యూ సినిమా చుసిన ఒక వ్యక్తి కోణానికి సంబంచినది... ఒక సగటు సినిమా అభిమాని వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook