Tuck Jagadish Movie: నేచురల్ స్టార్ నాని టక్ జగదీష్ విడుదలపై క్లారిటీ వచ్చేసింది, ఆ వదంతులు నమ్మవద్దు

Tuck Jagadish Release Date | నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా టక్ జగదీష్. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన నిన్ను కోరి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంతో తెరకెక్కిన టక్ జగదీష్ సినిమా విడుదలపై వదంతులు ప్రచారంలో ఉన్నాయి.

Written by - Shankar Dukanam | Last Updated : May 27, 2021, 01:38 PM IST
  • నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా టక్ జగదీష్
  • ఫ్యామిలీ డ్రామా నేపథ్యంతో తెరకెక్కిన టక్ జగదీష్ సినిమా
  • ఈ సినిమాకు సంబంధించి ప్రచారంలో ఉన్న వార్తలపై స్పష్టత వచ్చింది
Tuck Jagadish Movie: నేచురల్ స్టార్ నాని టక్ జగదీష్ విడుదలపై క్లారిటీ వచ్చేసింది, ఆ వదంతులు నమ్మవద్దు

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట మూవీ టక్ జగదీష్. వెరైటీ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా టక్ జగదీష్. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన నిన్ను కోరి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఫ్యామిలీ డ్రామా నేపథ్యంతో తెరకెక్కిన టక్ జగదీష్ సినిమాలో నాని (Actor Nani)తో హీరోయిన్లు రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ జతకట్టారు. వాస్తవానికి ఈ సినిమాను ఏప్రిల్ 16న విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. కానీ కరోనా సెకండ్ వేవ్, థియేటర్లు తాత్కాలికంగా మూతపడటంతో టక్ జగదీష్ విడుదల వాయిదా పడింది. ఈ సినిమాకు సంబంధించి ప్రచారంలో ఉన్న వార్తలపై స్పష్టత వచ్చింది. టక్ జగదీష్ మూవీని ఓటీటీ వేదికగా విడుదల చేయడం లేదని, వదంతులు నమ్మవద్దంటూ టాలీవుడ్ ప్రముఖ పీఆర్వో బీఏ రాజు టీమ్ తెలిపింది. ఈ మేరకు ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది. 

Also Read: Also Read: Mugguru Monagallu Trailer review: ముగ్గురు మొనగాళ్లు ట్రైలర్ రివ్యూ

టక్ వేసుకుని తినడానికి కూర్చున నాని వీపు భాగం నుంచి కత్తి తీస్తున్న ఫొటో ప్రేక్షకులలో అంచనాలు పెంచేసింది. టక్ జగదీష్ ఫస్ట్‌లుక్ తరువాత శివ నిర్వాణ, నాని క్రేజీ కాంబినేషన్  Tuck Jagadish Movie హిట్ కొట్టేలా ఉందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.  షైన్ స్క్రీన్స్ బ్యానర్ ఆధ్వర్యంలో సాహు గారపతి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. ఎస్ఎస్ థమన్ స్వరాలు సమకూర్చాడు. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌ ఆలస్యం అవడంతో గత ఏడాది విడుదల కావాల్సిన మూవీ ఈ వేసవిలో సైతం ముందుకు రాలేకపోయింది. 

Also Read: RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీ డిజిటల్, శాటిలైట్ రైట్స్ కోసం పోటీపడ్డ ప్రముఖ సంస్థలు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News