Telugu OTT Releases: వినాయకచవితి స్పెషల్: రేపు థియేటర్లలో, ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు వెబ్ సిరీస్‌లు ఇవే..

Telugu OTT Releases: కరోనా రాకముందు శుక్రవారం రాగానే థియేటర్లు సినిమా రిలీజ్ లతో నిండిపోయాయి. కానీ ఇప్పుడు ఆ జాబితాలోకి ఓటీటీలు చేరాయి.  రేపు వినాయకచవితి సందర్భంగా థియేటర్స్ మరియు ఓటీటీలలో విడుదల అయ్యే సినిమాలేంటో ఓసారి చూసేద్దాం..   

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 9, 2021, 07:43 PM IST
  • రేపే(సెప్టెంబరు 10) వినాయక చవితి
  • పండగ సందర్భంగా పలు సినిమాలు, వెబ్ సిరిస్ లు విడుదల
  • థియేటర్స్, ఓటీటీలలో సందడి
Telugu OTT Releases: వినాయకచవితి స్పెషల్:  రేపు థియేటర్లలో, ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు వెబ్ సిరీస్‌లు ఇవే..

Telugu OTT Platform: వినాయక చవితిని పురస్కరించుకుని శుక్రవారం పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు సందడి చేయనున్నాయి. అయితే థియేటర్లు, ఓటీటీలలో రిలీజ్ రాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏంటో ఓ సారి చూద్దాం. 

థియేటర్స్‌లో రిలీజ్ అయ్యే సినిమాలు 

సిటీమార్‌: గోపీ చంద్ తమన్నా హీరో, హీరోయిన్లుగా నటించిన ‘సిటీమార్‌’ మూవీ సెప్టెంబర్‌ 10న థియేటర్లో సందడి చేయనుంది.  సంపత్ నంది దర్శకత్వంలో కబడ్డీ(Kabaddi) నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. 

తలైవి: దివంగత నటి, ముఖ్యమంత్రి జయలలిత బయో పిక్ గా తెరకెక్కిన ‘తలైవి’ రేపు రిలీజ్ కానుంది. బాలీవుడ్ క్వీన్ కంగనా(Kangana) జయలలితగా నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో  రిలీజ్ కానుంది.

జాతీయ రహదారి: లాక్ డౌన్ సమయంలో ప్రజలు పడిన కష్టాలు. ఇబ్బందులను ఇతి వృత్తంగా తీసుకుని తెరకెక్కించిన ‘జాతీయ రహదారి’ సినిమా కూడా రేపు థియేటర్ లో  విడుదల కానున్నది.

Also Read: Deva Katta: సినిమా టికెట్ల అమ్మకాలు.. Ap govt పై దేవ కట్టా విమర్శలు

ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు

అమెజాన్‌ ప్రైమ్‌‌ : రేపు నాని మూవీ టక్‌ జగదీష్‌ (Tak Jagdish)తో పాటు ముంబై డైరీస్‌ 26/11 , లూలా రిచ్‌ , మాటల్‌ కమ్‌బాట్‌, హెచ్‌బీవో మ్యాక్స్‌ , మాలిగ్‌నాంట్‌ లు స్ట్రీమింగ్ కానున్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌‌ :  ఈరోజు సెప్టెంబర్‌ 09 న బ్లడ్‌ బ్రదర్స్‌ రిలీజ్ అయ్యింది. ఇక రేపు వినాయక చవితి సందర్భంగా మలయాళం సూపర్ హిట్ సినిమా లూసిఫర్‌ , కేట్‌ ,  మెటల్‌ షాప్‌ మాస్టర్స్‌  లు ప్రసారం కానున్నాయి.

ఆహా : మహాగణేశా,  ద బేకర్‌ అండ్‌ ద బ్యూటీ, వూట్‌ క్యాండీ లు స్ట్రీమింగ్ కానున్నాయి.

జీ 5   : రేపు వినాయక చవితి కానుకగా నెట్‌ , డిక్కీ లూనా ,  క్యా మెరీ సోనమ్‌ గుప్తా బెవాఫా హైలు స్ట్రీమింగ్ కానున్నాయి.

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌  :  సెప్టెంబర్‌ 11న తుగ్లక్‌ దర్బార్‌ ప్రసారం కానున్నది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News