Nayanathara weds Vignesh Shivan: వైరల్ అవుతున్న నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి పత్రిక
Nayanathara weds Vignesh Shivan: తెలుగు, తమిళ అగ్ర నటి నయనతార వెడ్స్ విఘ్నేశ్ శివన్. మరి కాస్సేపట్లో పెళ్లి. సోషల్ మీడియాలో ఇప్పుడిదే చర్చ నడుస్తోంది. అన్నట్టు ఈ ఇద్దరి పెళ్లి పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Nayanathara weds Vignesh Shivan: తెలుగు, తమిళ అగ్ర నటి నయనతార వెడ్స్ విఘ్నేశ్ శివన్. మరి కాస్సేపట్లో పెళ్లి. సోషల్ మీడియాలో ఇప్పుడిదే చర్చ నడుస్తోంది. అన్నట్టు ఈ ఇద్దరి పెళ్లి పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నయనతార మొత్తానికి ప్రేమ వివాహమే చేసుకుంటోంది. తెలుగు, తమిళ భాషల్లో అగ్రనటిగా ఉన్న నయనతార అంటే పడి చచ్చేవాళ్లు చాలామందే ఉన్నారు. ముందు ప్రభుదేవాతో సాగిన ప్రేమాయణం చివర్లో ఎందుకో తెగిపోయింది. ఆ తరువాత తమిళ హీరో శింబుతో ప్రేమ వ్యవహారం సాగింది. అది కూడా ఆగిపోయింది. అయితే గత రెండేళ్లుగా విఘ్నేష్ శివన్‌తో సాగుతున్న ప్రేమాయణం మాత్రం చివరి వరకూ కొనసాగింది. అంటే పెళ్లి పీటల వరకూ వచ్చేసింది. మరి కొద్దిగంటల్లో నయనతార వెడ్స్ విఘ్నేష్ శివన్ ఘట్టం పూర్తి కానుంది.
జూన్ 9వ తేదీ అంటే గురువారం ఉదయం 8.30 గంటలకు మహాబలిపురంలోని షెరటాన్ గ్రాండ్‌లో ఈ ఇద్దరి పెళ్లి అత్యంత వైభవంగా జరగనుంది. ఈ పెళ్లికి ముహూర్తం తిరుమల తిరుపతి పండితులు నిర్ణయించారు. ఆహ్వానం మాత్రం కొద్దిమందిగా అందిందని తెలుస్తోంది. ఇరు కుటుంబాల సభ్యులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన కొంతమందికి మాత్రమే పెళ్లి ఆహ్వానం అందిందట. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో పాటు కొందరు తమిళనాడు రాజకీయ నేతలు హాజరుకానున్నారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి బాలయ్య, చిరంజీవి, సమంతలకు ప్రత్యేకంగా ఆహ్వానం అందింది.
ఇప్పుడు ఇద్దరి పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో మోడ్‌లో ఉన్న పెళ్లి పత్రిక అందర్నీ ఆకట్టుకుంటోంది. నయనతార పెళ్లి కోసం గద్వాల్ చీరతో పాటు కంచిపట్టు చీర కూడా సిద్ధమైంది. మహాబలిపురంలో పెళ్లి సింపుల్‌గా జరిగినా..చెన్నైలో రిసెప్షన్ గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారట.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి