Mokshagna: మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించే అప్ డేట్ ఇచ్చిన బాలకృష్ణ..
Mokshagna cine entry: నందమూరి నట సింహం బాలకృష్ణ రీసెంట్ గా 50 యేళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని తెలుగు సినీ ఇండస్ట్రీ ఘనంగా సత్కరించింది. ఈ సందర్బంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించే అప్ డేట్ ఇచ్చారు.
Nandamuri Mokshagna: గత దశాబ్ద కాలంలో బాలకృష్ణ ఫ్యాన్స్ ఆయన కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం కళ్లలో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు. నట సింహం కుమారుడిని సినీ అరంగేట్రం ఎపుడు చేస్తాడా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు.అయితే మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై బాలయ్య తన మనసులో మాట పంచుకున్నారు. ఇప్పటికే మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి సంబంధించి అన్ని పనులు పూర్తయ్యాయి. మరో మూడు నెలల్లో షూటింగ్ కూడా మొదలవుతుందని చెప్పుకొచ్చారు. సినిమా కూడా ఫైనల్ అయిపోయిందని చెప్పారు. అంతేకాదు సినీ రంగ ప్రవేశం చేయకముందే మోక్షజ్ఞ స్టార్ అయిపోయాడు. ఆయన కోసం ఇప్పటికే ఐదారు కథలను ఫైనల్ చేసినట్టు చెప్పుకొచ్చారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఇక నందమూరి ఫ్యామిలి నుంచి వారసుడు వచ్చి 19 ఏళ్లు అవుతుంది.మరి ముఖ్యంగా బాలయ్య బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. అప్పట్లో మోక్షజ్ఞ ఆదిత్య 369 మూవీ సీక్వెల్ ఆదిత్య 999 మాక్స్ మూవీతో ఎంట్రీ ఉంటుందని చెప్పుకొచ్చారు. నందమూరి కళ్యాణ్ రామ్ తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి హీరోగా ఎవరు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వలేదు. దీంతో హీరోగా మోక్షు ఎపుడు ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు వెయిట్ చేస్తూనే ఉన్నారు.
ఆ మధ్య మోక్షజ్ఞ కాస్త బొద్దుగా కనిపించి ఫ్యాన్స్ ను కాస్త షాక్ కు గురిచేసారు. అంతేకాదు మధ్యలో అతను హీరోగా చేయడంపై ఇంట్రెస్ట్ లేదని వాదనలు వినిపించాయి. కానీ బాలయ్య మాత్రం మోక్షజ్ఞను డాన్స్, ఫైట్స్, డైలాగ్స్, నటనలో అమెరికాలో మంచి ట్రెయినింగ్ ఇప్పించాడు. రీసెంట్ గా మోక్షజ్ఞ స్లిమ్ అయి కొత్త లుక్ కనిపించి ఫ్యాన్స్ ను డబుల్ ఖుషీ చేసాడు.
ఇప్పటికే హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ ఎంట్రీ ఖరారైనట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.ఇక సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ ప్రకటన వెలుబడనుంది. ఇక మోక్షజ్ఞ సరసన శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ హీరోయిన్ గా తెరంగేట్రం చేయడం దాదాపు ఖాయం అనే ముచ్చట విడబడుతోంది.
ఈ సినిమాను ప్రశాంత్ వర్మ పూర్తిగా యాక్షన్ కమ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించబోతున్నాడట. అంతే కాదు హనుమాన్ మూవీ తరహాలో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ యాడ్ చేసేలా ఈ సినిమా స్క్రిప్ట్ ఫైనల్ చేసినట్టు సమాచారం. ఇక బాలయ్య కూడా ఈ సినిమాలో లీడ్ రోల్లో యాక్ట్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు మోక్షం కోసం బాలయ్య ఇప్పటికే కొన్ని కథలను ఓకే చేసినట్టు సమాచారం త్రివిక్రమ్,హరీష్ శంకర్, రటాల శివ,బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, బాబీ వంటి టాప్ దర్శకులు మోక్షజ్ఞ కోసం స్టోరీలను వండివార్చే పనిలో పడ్డట్టు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. మొత్తంగా మోక్షజ్ఞ ఎంట్రీ మాములుగా ఉండబోదనే విషయం స్పష్టమవుతోంది.
ఇదీ చదవండి: చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..
ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.