Drugs case: రకుల్ ప్రీత్ సింగ్ ఆర్థిక లావాదేవీలపై కన్నేసిన NCB
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు ( Sushant Singh Rajput death case ) విచారణలో భాగంగా ఎన్‌సిబి దర్యాప్తు చేస్తున్న ముంబై డ్రగ్స్ కేసులో ( Mumbai Drugs case ) ఏరోజుకు ఆరోజు పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే డ్రగ్స్ కేసులో దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్, శ్రద్దాకపూర్, రకుల్ ప్రీత్ సింగ్‌లు ఎన్‌సిబి విచారణకి ( NCB investigation ) హజరయ్యారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు ( Sushant Singh Rajput death case ) విచారణలో భాగంగా ఎన్‌సిబి దర్యాప్తు చేస్తున్న ముంబై డ్రగ్స్ కేసులో ( Mumbai Drugs case ) ఏరోజుకు ఆరోజు పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే డ్రగ్స్ కేసులో దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్, శ్రద్దాకపూర్, రకుల్ ప్రీత్ సింగ్‌లు ( Rakul preet Singh ) ఎన్‌సిబి విచారణకి ( NCB investigation ) హజరయ్యారు. ఎన్సీబీ విచారణ ( NCB probe)కి హాజరైన తరువాత రకుల్ ప్రీత్ సింగ్ ముంబై నుండి తిరిగి హైదరాబాద్ చేరుకుంది. క్రిష్ డైరెక్షన్‌లో వైష్ణవ్ తేజ్‌తో కలిసి చేస్తున్న సినిమా షూటింగ్ ప్రారంభించింది. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని ఈ చిత్ర బృందం యోచిస్తున్నారు. Also read : Tamilnadu: ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కమల్ హాసన్ ధన్యవాదాలు
తాజాగా ముంబై మీడియా నుండి అందుతున్న సమాచారం ప్రకారం, గత రెండేళ్ల నుంచి రకుల్ ఆర్థిక లావాదేవీలకు ( Rakul preet Singh's financial transactions ) సంబంధించిన రికార్డులను ఎన్‌సిబి దర్యాప్తు చేయనుంది. గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు, తమిళ, హింది భాషలలో అగ్ర హీరోల సరసన నటిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్ ఆర్థిక లావాదేవీలను సైతం నిశితంగా పరిశీలించాలని ఎన్.సి.బి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అందుకే, త్వరలో ఈ రికార్డులన్నీ ఎన్‌సిబి తనిఖీ చేయనుంది అని సమాచారం.
రకుల్ ప్రీత్ సింగ్ ఖాతా నుంచి ఎవరైనా డ్రగ్ డీలర్స్ ఖాతాల్లోకి ఏమైనా నిధులు మళ్లాయా అనే సందేహంతోనే ఎన్సీబీ ఈ నిర్ణయం తీసుకుందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. Also read : Ram Gopal Varma: రియా చక్రవర్తిపై సినిమా తీయనున్న వర్మ ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe