Nenu Meeku Baaga Kavalsinavaadini Pre Release event on 14th September: యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఆయన హీరోగా నేను మీకు బాగా కావాల్సిన వాడిని అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 16వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదలై మంచి రెస్పాన్స్ కూడా తెచ్చుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక తాజా సమాచారం మేరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ప్లాన్ చేశారు ఈ సినిమా నిర్మాతలు. సెప్టెంబర్ 14వ తేదీ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. సాయంత్రం 6:00 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తారు అనే విషయం మీద అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.


శ్రీధర్ గడే దర్శకత్వంలో సంజన ఆనంద్ హీరోయిన్ గా సోను తాకు మరో హీరోయిన్లుగా ఈ సినిమాని రూపొందించారు. ఎస్ వి కృష్ణారెడ్డి, సమీర్, గౌతమ్ రాజు, బాబా భాస్కర్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాను కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మిస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది.


మణిశర్మ సంగీతం అందించిన పాటలు కూడా సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడడానికి పాటలు కారణమయ్యాయి. ఇక ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ  రిలీజ్ ఈవెంట్ ఘనంగా ప్లాన్ చేశారు సినిమా నిర్మాతలు. వాస్తవానికి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీనే సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ వారం రోజులు వాయిదా పడి సెప్టెంబర్ 16వ తేదీ విడుదలవుతోంది.


Also Read: Film Federation Strike: మళ్లీ షూటింగ్స్ బంద్.. సమ్మె నోటీసులు ఇచ్చిన ఫిలిం ఫెడరేషన్!


Also Read: SSMB 28 Title: మహేష్-త్రివిక్రమ్ మూవీకి ఆసక్తికర టైటిల్.. 'అ' సెంటిమెంట్ వదలడం లేదుగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి