SSMB 28 Title: మహేష్-త్రివిక్రమ్ మూవీకి ఆసక్తికర టైటిల్.. 'అ' సెంటిమెంట్ వదలడం లేదుగా!

Aarambham Title in Consideration for SSMB 28: మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సినిమాకు ఒక ఆసక్తికర టైటిల్ పరిశీలనలో ఉందని అంటున్నారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 13, 2022, 11:14 AM IST
 SSMB 28 Title: మహేష్-త్రివిక్రమ్ మూవీకి ఆసక్తికర టైటిల్.. 'అ' సెంటిమెంట్ వదలడం లేదుగా!

Aarambham Title in Consideration for SSMB 28: సినిమా ప్రకటించిన చాలాకాలం తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సినిమా ప్రకటన వచ్చి చాలా కాలం అయింది కానీ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనే విషయం మీద ఎలాంటి క్లారిటీ లేదు. నిజానికి ఆగస్టు నెలలోనే షూటింగ్ మొదలవుతుంది అన్నారు కానీ ఆ షూటింగ్ ఎట్టకేలకు సెప్టెంబర్ 12వ తేదీన అధికారికంగా ప్రారంభమైంది.

అయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ గురించి కూడా అప్పుడే చర్చ జరుగుతోంది. ఎందుకంటే సినిమా షూటింగ్ మొదలైందని చెప్పడానికి సినిమా టీం ssmb28 ఆరంభం అనే హ్యాష్ ట్యాగ్ వాడింది. దీంతో ఈ సినిమాకు ఆరంభం అనే టైటిల్ ఫిక్స్ చేసి ఉండవచ్చనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఎందుకంటే నిజానికి త్రివిక్రమ్ ఎక్కువగా అ అనే పదంతో మొదలయ్యే టైటిల్స్ వాడడానికి ఇష్టపడుతూ ఉంటారు.

అందుకే ఆయన అతడు, అజ్ఞాతవాసి, అ ఆ, అత్తారింటికి దారేది, అరవింద సమేత ఇటీవల విడుదలైన అలవైకుంఠపురంలో సినిమాకి కూడా ఈ అ తో మొదలయ్యే టైటిల్స్ వాడారు. ఈ లెక్కన మహేష్ బాబు సినిమాకి ఆరంభం అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతోంది. అయితే ఒక రకంగా సినిమా షూటింగ్ సగభాగం పూర్తయిన తర్వాత టైటిల్ ప్రకటించడం త్రివిక్రమ్ కి అలవాటు.

దీంతో ఈ ఆరంభం టైటిల్ కాకపోవచ్చు అని ఒక వర్గం వారు భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ కోసం తన పవర్ఫుల్ డైలాగ్స్ సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

Also Read: Vijay Devarakonda on Janaganamana: 'జనగణమన' మర్చిపోండి..పరోక్షంగా చెప్పేసిన విజయ్ దేవరకొండ!

Also Read: Amala Paul on Tollywood: టాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్.. నెపోటిజం, రొట్ట సినిమాలు అంటూ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News