Jr NTR Devara: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రభంజనం సృష్టించగా.. అందులో కొమరం భీమ్గ జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన పర్ఫామెన్స్ ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో అభిమానులను తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా విడుదలైన దగ్గర నుంచి ఎన్టీఆర్ తదుపరి ప్రాజెక్ట్స్ పై దేశవ్యాప్తంగా అందరికీ అంచనాలు ఏర్పడ్డాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరా సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కోస్టల్ బ్యాక్ డ్రాప్ తో,హై రేంజ్ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల చేయడానికి చిత్ర బృందం అన్ని సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ చిత్రంపై అంచనాలు భారీగా పెంచింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నాన్ థియరిటికల్ బిజినెస్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


తారక్ మూవీ అంటే కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలుసు. అందుకే ఈ మూవీ నాన్ థియరిటికల్ బిజినెస్ కూడా అదే రేంజ్ లో స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే మూవీకి సంబంధించి షూటింగ్ పనులు చాలా వరకు పూర్తయ్యాయి అని సమాచారం. టాకీ పార్టీ కూడా 85% కు పైగా కంప్లీట్ అయిపోయిందట. ఇక దేవర విడుదల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రీసెంట్ గా మూవీకి సంబంధించిన మ్యూజిక్ రైట్స్ టి సిరీస్ సంస్థ మంచి భారీ రేటుకు సొంతం చేసుకుంది. 


తాజాగా ఈ మూవీకి సంబంధించిన డిజిటల్ హక్కులను నేట్ ఫ్లిక్స్ దిమ్మ తిరిగే ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుందట. దేవరా సినిమా ఓటిటి హక్కులను తమ సంస్థ స్వంతం చేసుకుందని ఈ మధ్య సంక్రాంతి సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ ఒక పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంస్థ ఈ మూవీకి సంబంధించిన డిజిటల్ రైట్స్ సొంతం చేసుకోవడానికి ఏకంగా 155 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించిందని టాక్. నిన్న మొన్నటివరకు అల్లు అర్జున్ పుష్ప 2 ఓటీటీ రైట్స్ ఏకంగా నూతనలబై కోర్టులకు అమ్ముడుపోయాయని.. అదే పెద్ద రికార్డ్ అనే వార్త నడుస్తూ ఉండింది.
కాగా ఇప్పుడు ఆ రికార్ ని దేవరాజ్ సినిమా బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది. విడుదలకు ముందే కలెక్షన్స్ ఈ రేంజ్ లో ఉంటే ఇక విడుదల తరువాత బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.


Also Read: WINGS INDIA: హైదరాబాద్‌లో విమానాల పండుగ.. షో చూస్తే వావ్‌ అంటారు


Also Read: EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. గడువు పెంచుతూ EPFO కీలక నిర్ణయం..!


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter