Kalki2898AD: కల్కి సినిమాకి మరో తలనొప్పి…రిలీజ్ డేట్ పై కీలక నిర్ణయం
Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం కల్కి 2898 AD. ఈ సినిమా మే 9 న విడుదల అవుతుంది అని చిత్ర బృందం ప్రకటించి చాలా కాలం అయ్యింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే మాత్రం, ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు.
Kalki 2898 AD Release Date: ఈ మధ్యనే సలార్ సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్ హీరోగా మహానటి సినిమా తో డైరెక్టర్ గా తన సత్తా చాటిన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కల్కి 2898 AD. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. కానీ చిత్ర విడుదల తేదీ విషయంలో మాత్రం సందిగ్దత ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
నిజానికి ఈ సినిమా ని మే 9 న విడుదల చేద్దామని చిత్ర బృందం ఫిక్స్ అయ్యింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. కానీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల సమయం లో సినిమా విడుదల ఎందుకు అని అనుకున్న మూవీ యూనిట్ ఆలోచన లో పడింది.
డిస్ట్రిబ్యూటర్లు, సన్నిహితులు కూడా అదే మాట చెప్పడం తో నిర్మాత అశ్వినీ దత్ కూడా విడుదల విషయం లో తటపటాయించారు. అయితే మరోవైపు సినిమా ఫస్ట్ కాపీ కూడా ఇంకా సిద్ధం కాలేదు. ఒక కీలక భాగం షూటింగ్ పూర్తి చేయడానికి కూడా ఇంకా వారం సమయం పడుతుందట. దాంతో అసలు ఒకవేళ వారు మే 9న విడుదల చేయాలి అనుకుంటే అప్పటికి ఈ సినిమా అవుతుందో లేదో అన్న విషయం కూడా ప్రస్తుతం నిర్మాతకు తలనొప్పిగా మారినట్టు వినికిడి. ఇక షూటింగ్ పూర్తవగానే మిగతా పనులను చిత్ర బృందం మొదలు పెట్టాల్సి ఉంది.
దీంతో సినిమా విడుదల విషయంలో నిర్మాతలు తెగ చర్చలు జరుపుతున్నారు కానీ ఒక నిర్ణయానికి రాలేదట మే 9న సెంటిమెంట్ డేట్ కాబట్టి దానిని వదులుకోవాలని అశ్విని దత్ గారికి ఏమాత్రం లేదు. కానీ నిజంగానే సినిమాని వాయిదా వేయాల్సిన పరిస్థితి వస్తే జూన్ లో విడుదల చేయాలా లేక జులై లో విడుదల చేయాలా అని కూడా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.
ఆగస్టులో పుష్ప 2 సినిమా విడుదల కు సిద్ధమవుతోంది కాబట్టి ఆగస్టులో సినిమాని విడుదల చేయడం కష్టం. సెప్టెంబర్ దాకా వాయిదా వేస్తే బాగా లేట్ అయిపోతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సినిమా విడుదల విషయంలో నిర్మాతలు మరొక రెండు వారాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఒక పక్క ఓజీ, దేవర, గేమ్ చేంజర్ వంటి సినిమాలు కూడా వరుసగా విడుదల కి సిద్ధమవుతున్నాయి. మరో పక్క కల్కి డిజిటల్ రైట్స్ ను నిర్మాతలు ఏకంగా 300 కోట్లకు పైగా అమ్మారని వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: Nikhil Siddhartha TDP: హీరో నిఖిల్ సిద్ధార్థ్ సంచలనం.. అనూహ్యంగా టీడీపీలో చేరిక
Also Read: KTR Fire: కేకే, కడియం వంటి వాళ్లు మళ్లీ వచ్చి కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి రానివ్వం: కేటీఆర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook