ఉత్తర్ ఐర్లాండ్ లో చేపట్టిన ఒక పరిశోధన ప్రకారం గాస్ట్రోఇంటెస్టినల్ ( Gastrointestinal ) సమస్య ఉన్న పిల్లలకు కోవిడ్ -19 ( Covid-19 ) సోకే ప్రమాదం ఎక్కువట. దీన్ని అస్సలు తేలికగా తీసుకోరాదు అని చెబుతున్నారు. పెద్దల్లో కనిపించే కోవిడ్-19 లక్షణాలు వేరే అని.. పిల్లల్లో కనిపించే లక్షణాలు వేరుగా ఉంటున్నాయట.



చాలా మంది పిల్లలకు కరోనావైరస్ సోకినా ఆ లక్షణాలు కనిపించడం లేదు అని కనుక్కున్నారు పరిశోధకులు. కరోనావైరస్ ( Coronavirus ) పాజిటీవ్ గా తేలిన పిల్లల్లో డయేరియా, వాంతులు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించాయట. 



డైలీ మెయిల్ లో పబ్లిష్ అయిన రిపోర్టు ప్రకారం వైద్యులు ఇకపై పిల్లలకు వైద్యం చేసే సమయంలో పై లక్షణాలు కనిపిస్తే అలెర్ట్ అవ్వాల్సి ఉంటుంది. బెల్ ఫాస్ట్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ టామ్ వాటర్ ఫీల్డ్ బీబిసికి తెలిపిన వివరాల ప్రకారం....డయేరియా, వాంతులు అనేవి కూడా కోవిడ్-19 లక్షణాలు ( Covid-19 Symptoms ) అవవచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి అన్నారు. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్య ఉన్నట్టు అయితే మరిన్ని టెస్టులు నిర్వహించాల్సి ఉంటుంది అని తెలిపారు