లావెండర్ నూనెను మీరు చాలా మంది ఇంట్లో, షాపుల్లో చూసి ఉంటారు. మంచి సువాసనను వెదజల్లుతుంది. మనసుకు ప్రశాంతను ఇస్తుంది. డిస్టర్బ్ గా ఉన్నవాళ్ల మైండ్ కూడా లావెండర్ నూనె వాసనకు సెట్ అయిపోతుంది. స్టీమ్ డిస్టిలేషన్ ప్రాసెస్ లో రెడీ అయ్యే లావెండర్ నూనెకు చాలా ప్రత్యకతలు ఉన్నాయి. శరీరం రిలాక్స్ అయ్యేలా చేయడం మాత్రమే కాదు... నీరసం కూడా దూరం చేస్తుంది. దాంతో పాటు చర్మం, జుట్టు ఆరోగ్యానికి ( Health ) కూడా చాలా మంచిది.
ఒత్తిడిని దూరం చేస్తుంది ( Lavender Removes Stress )
లావెండర్ ఆయిల్ వల్ల ఒత్తిడి తగ్గుతుంది. వ్యాకులత దూరం అతుంది. ఇది యాంటి డిప్రెసెంట్ తత్వాలతో కూడుకున్నది. మనసును శాంత పరుస్తుంది. టీ ట్రీ నూనెతో జోడిస్తే మరిన్ని లాభాలు కలుగుతాయి. దీనిని కాల్చడం వల్ల మైండ్ స్ర్టెస్ ఫ్రీ అవుతుంది.
చక్కని నిద్ర ( Lavender For Sound Sleep)
మీరు ప్రశాంతంగా నిద్రపోవాలి అనుకుంటే లావెండర్ అయిల్ ప్రయత్నించండి. మంచి నిద్రపడుతుంది. దీనిని అరోమా థెరపీలో వినియోస్తారు. ఇది టోటల్ బాడీని రిలాక్స్ చేస్తుంది. కావాలంటే మీరు తలగడకు రెండువైపులా ఒకో చుక్క లావెండర్ అయిల్ వేయవచ్చు.
తలనొప్పి ( Lavender For Headache )
తలనొప్పి ఉంటే లావెండర్ నూనెను ట్రై చేయండి. స్ట్రెస్ ను దూరం చేస్తుంది. మైగ్రేన్ ఉన్నవారికి లావెండర్ అయిల్ చాలా ఉపయోగపడుతుంది.
చర్మంపై... ( Lavender Skin Benefits )
లావెండర్ నూనె వల్ల చర్మం కూడా నిగనిగలాడుతుంది. అయితే దీన్ని డైరక్ట్ గా స్కిన్ పై పెట్టకండి. దీనికి క్యారియర్ నూనెతో లేదా మాయిశ్చరైజర్ తో కలిపి తీసుకోండి. ఇది మొటిమలను కూడా నివారిస్తుంది. నాచురల్ టోనర్ గా కూడా ఉపయోగపడుతుంది.
మీ జీవితా విధానానికి( Lifestyle ) ఉపయోగపడే చిట్కాలు
-
Health Tips : ఈ సమస్యలు ఉన్న వాళ్లు పసుపు పాలు తాగడం మంచిది కాదు
-
Eye Protection: స్మార్ట్ ఫోన్ వెలుగు నుంచి కంటిని కాపాడుకుందాం
-
Shopping Tips: కోవిడ్-19 సమయంలో మాల్ కి వెళ్తున్నారా ? ఇది చదవండి.
-
Covid-19 Remedies: ఆవిరి చికిత్సతో కరోనావైరస్ ఖేల్ ఖతం... రీసెర్చ్ వెల్లడి
-
Quarantine Tips: హోమ్ క్వారంటైన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
-
Smoking and Covid-19: సిగరెట్ తాగే వారికి కోవిడ్-19 వల్ల మరింత ప్రమాదం