New Tension for Pawan Kalyan producers: పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. చివరిగా ఆయన భీమ్లా నాయక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతానికి ఆయన డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నాడు. వీటితో పాటుగా సుజిత్ దర్శకత్వంలో ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అనే మూవీ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలు లైన్ లో పెట్టాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవి కాకుండా సముద్రఖని దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో మరో సినిమా కూడా చేస్తున్నాడు. దానికి బ్రో అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. కానీ అందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. అయితే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఏడాది జూన్ నెలలో పూర్తి కావాల్సిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అంతకు ముందే రద్దుచేసి ప్రస్తుత అధికార పక్షం ఎన్నికలకు ముందస్తుగానే వెళ్లే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.


Also Read: Divyabharathi Tollywood Entry: సుడిగాలి సుధీర్ కోసం తమిళ భామ.. ఏకంగా దివ్యభారతిని దింపుతున్నారుగా!


అలా జరిగితే ముందు నుంచే తాను ప్రజల్లో ఉంటానని ఆయన అన్నారు. అయితే ఒకవేళ అదే గనక జరిగితే ఆయనతో ప్రస్తుతం సినిమాలు చేస్తున్న అందరి నిర్మాతలకు పెద్ద దెబ్బ అని సినీ వర్గాల వారు కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే హరిహర వీరమల్లు సినిమా దాదాపు మూడేళ్ల నుంచి ప్రొడక్షన్ దశలో ఉంది.


ఇంకా షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజి సినిమా ప్రొడక్షన్ ఈ మధ్యనే మొదలైంది. హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా 10 రోజుల షూట్ మాత్రమే పూర్తి చేసుకుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక ఎన్నికల్లో బిజీ అయ్యి అటువైపు మళ్లాల్సి వస్తే ఈ సినిమాల నిర్మాతలు అందరూ మళ్లీ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే దాదాపుగా అన్ని నిర్మాణ సంస్థల వారు ఫైనాన్స్ తీసుకువచ్చే సినిమాలు చేస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమాలు హోల్డ్ లో పడితే వారు వడ్డీలు కోల్పోయి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నాయని చెబుతున్నారు.


Also Read: Custody Movie Review: 'కస్టడీ' సినిమా రివ్యూ : నాగ చైతన్య హిట్టు కొట్టాడా?



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook