Niharika Konidela First Feature Film Pooja Ceremony: అన్న వరుణ్‌ తేజ్ పెళ్లి తరువాత నిహారిక కొణిదెల కొత్త సినిమాను మొదలుపెట్టారు. ఇప్పటివరకు ప్రొడ్యూసర్‌గా వెబ్‌సిరీస్‌లు, షార్ట్‌ ఫిల్మ్స్‌ నిర్మించిన నిహారిక తొలిసారి.. సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్‌పీ, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ప్రొడక్షన్ నెం.1గా తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి హీరో వరుణ్ తేజ్ క్లాప్ కొట్టగా.. మెగా బ్రదర్ నాగబాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించగా.. నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్‌ని నిహారిక కొణిదెల, దర్శకుడు యదు వంశీ సహా చిత్ర యూనిట్ సభ్యులకు అందించారు. ఈ వేడకలో కొత్త జంట వరుణ్‌ తేజ్‌-లావణ్య త్రిపాఠి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనంతరం నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఇప్పటివరకు వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలింస్ మాత్రమే చేశామని.. తొలిసారి ఫీచర్ ఫిల్మ్ స్టార్ట్ చేశామని తెలిపారు. శ్రీరాధా దామోదర్ స్టూడియోస్‌తో కలిసి సినిమాను నిర్మిస్తున్నట్లు తెలిపారు. చాలా సంతోషంగా ఉందని.. అయితే టెన్షన్‌ కూడా ఉందన్నారు. యాదు వంశీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారని.. మంచి టీమ్‌, కాన్సెప్ట్‌తో రాబోతుందని చెప్పారు. ఇంత మంది కొత్త వాళ్లతో సినిమా చేయటం పెద్ద బాధ్యతగా భావిస్తున్నామన్నారు. తప్పకుండా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నామని అన్నారు. మంచి సినిమాలను తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తారనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నామని మెగా డాటర్ తెలిపారు. 


త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు డైరెక్టర్ యదు వంశీ తెలిపారు. 11 మంది హీరోలు, 4 హీరోయిన్స్‌ని పరిచయం చేస్తున్నామని.. తనకు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటామని నమ్ముతున్నామన్నారు. అందరూ సపోర్ట్ చేయాలని కోరారు. ఈ సినిమా ద్వారా తను, తన శ్రీమతి జయ నిర్మాతలుగా పరిచయం అవుతున్నామని శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ ఫణి తెలిపారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మించాలనే ఉద్దేశంతో ముందుకువచ్చినట్లు తెలిపారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌ అనుదీప్ దేవ్ వ్యవహరిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ బాధ్యతలు రాజు ఎడురోలు నిర్వర్తిస్తున్నారు. ఎడిటర్‌గా అన్వర్ అలీ పనిచేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా మన్యం రమేష్ వ్యవహరిస్తున్నారు.


Also Read: PF Interest: పీఎఫ్‌ ఖాతాదారులకు దీపావళి బొనంజా.. వడ్డీ వచ్చేసింది.. మీ బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి


Also Read: Diwali Offers: ఫ్లిప్‌కార్ట్‌లో ఎలక్ట్రిక్ బైకుల విక్రయాలు..దీపావళి సందర్భంగా ఈ బైక్ రూ. 58,999కే పొందవచ్చు!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook