Niharika Konidela First Instagram Post goes viral in Re Entry: 'మెగా డాటర్‌' నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 'మెగా' ట్యాగ్‌తో నిహారిక యాంకర్‌గా కెరీర్‌ మొదలుపెట్టారు. ఢీ జూనియర్ 1, ఢీ జూనియర్ 2 షోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన నవ్వు, చలాకీ మాటలతో అందరిని ఆకట్టుకున్నారు. ఇక నాగశౌర్య హీరోగా వచ్చిన 'ఒక మనసు' చిత్రంతో హీరోయిన్‌గా మారారు. ఈ సినిమా ఆమెకు పెద్దగా కలిసిరాలేదు. అనంతరం చేసిన 'సూర్యకాంతం' కూడా ప్రేక్షకులను అలరించలేకపోయింది. దాంతో మెగా డాటర్‌ కెరీర్ సందిగ్ధంలో పడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిహారిక కొణిదెలకు సినిమాలలో అంత సక్సెస్ రాకపోయినా.. నిర్మాతగా మాత్రం ముందుకెళ్తున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై తెలుగు వెబ్ సిరీస్ 'ముద్దపప్పు ఆవకాయ్‌'ను నిర్మించారు. ఈ సిరీస్ యూట్యూబ్‌లో విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందింది. మధ్యలో 2020 డిసెంబర్ 9న చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేయకపోయినా వెబ్ సిరీస్‌లలో నటిస్తానని.. నిర్మాతగా సినిమాలను కూడా నిర్మిస్తానని గతంలోనే ప్రకటించారు. చెప్పినట్టే ఇటీవలే నిర్మాతగా మరో ప్రాజెక్ట్ మొదలెట్టారు. 


సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే నిహారిక.. ఎప్పటికప్పుడు ఫ్యామిలీ సహా పర్సనల్‌ విషయాలు షేర్‌ చేసుకునేవారు. ఈ క్రమంలో ఇటీవల జిమ్‌లో షేర్‌ చేసిన ఓ వీడియోపై విపరీతంగా ట్రోల్స్‌ వచ్చాయి. దాంతో సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చిన మెగా డాటర్.. ఉన్నపళంగా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను డిలీట్‌ చేశారు. ఇక పబ్‌ కేసులో దొరకడం పెద్ద సంచలనంగా మారింది. దాంతో చాలా రోజులు ఇంటికే పరిమితమైన నిహారిక.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం నిహా చేసిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అయింది. 8 వారాల్లో తాను నేర్చుకున్న మూడు పాఠాలను అభిమానులతో పంచుకున్నారు.



నిహారిక నేర్చుకున్న మూడు పాఠాలు ఇవే:
# ఈ ప్రపంచం ఇంకా అంతం కాలేదు. 
# ఇతరులు ఏం చేస్తున్నారన్నది నేను అసలు పట్టించుకోను. 
# ఇప్పుడు నేను రీఫ్రెష్‌ అయ్యాను.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు చేసేందుకు ఉత్సాహంగా ఉన్నాను.  


Also Read: MS Dhoni CSK Captain: బ్రేకింగ్ న్యూస్.. చెన్నై కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ!


Also Read: Virat Kohli Half Century: విరాట్ కోహ్లీ తొలి హాఫ్ సెంచరీ.. స్టేడియంలో సందడి చేసిన అనుష్క (వీడియో)


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook