Ravindra Jadeja steps down Chennai Super Kings captaincy, CSK New Captain is MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్ రవీంద్ర జడేజా కీలక నిర్ణయం తీసుకున్నాడు. చెన్నై కెప్టెన్సీ నుంచి తాను తప్పుకుంట్లు ప్రకటించాడు. దాంతో ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ఎంఎస్ ధోనీ తిరిగి జట్టు బాధ్యతలు అందుకోనున్నాడు. ఈ విషయాన్ని చెన్నై ప్రాంచైజీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా దృవీకరించింది. ఐపీఎల్ 2022లో సీఎస్‌కే ఆడనున్న మిగతా మ్యాచ్‌లకు మహీ కెప్టెన్సీ వహించనున్నాడు.
ఐపీఎల్ 2022లో సీఎస్‌కే పేలవమైన ఆరంభంకు బాధ్యత వహిస్తూ రవీంద్ర జడేజా ఈ నిర్ణయం తీసుకున్నాడని చెన్నై సూపర్ కింగ్స్ తన ప్రకటనలో పేర్కొంది. తన ఆటపై మరింత దృష్టి కేంద్రీకరించేందుకు కెప్టెన్సీ నుంచి జడేజా తప్పుకున్నాడని తెలిపింది. 'రవీంద్ర జడేజా సీఎస్‌కే కెప్టెన్సీని తిరిగి ఎంఎస్ ధోనీకి అప్పగించబోతున్నాడు. జడేజా తన ఆటపై మరింత దృష్టి కేంద్రీకరించడానికి కెప్టెన్సీని వదులుకోవాలని నిర్ణయించుకున్నాడు. చెన్నైకి మళ్లీ నాయకత్వం వహించమని ధోనీని అభ్యర్థించాడు. జడేజా తన ఆటపై దృష్టి పెట్టడానికి సీఎస్‌కే బాధ్యతలు అందుకోవడానికి మహీ అంగీకరించాడు' అని సీఎస్‌కే పేర్కొంది.
ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభానికి ముందే ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో.. రవీంద్ర జడేజాను సీఎస్‌కే యాజమాన్యం కెప్టెన్‌గా నియమించింది. జడ్డు నాయకత్వంలో ఈ సీజన్‌లో సీఎస్‌కేకు పేలవ ఆరంభం లభించింది. ఓ దశలో హ్యాట్రిక్ ఓటములు కూడా ఎదుర్కొంది. ఎట్టకేలకు బోణీ చేసిన చెన్నై.. అతికష్టం మీద రెండో విజయాన్ని అందుకుంది. ఒత్తిడి తట్టుకోలేని జడ్డు అనూహ్యంగా కెప్టెన్సీని వదులుకున్నాడు. దాంతో మళ్లీ మహీ నాయకుడయ్యాడు.
Jadeja to handover CSK captaincy back to MS Dhoni:Ravindra Jadeja has decided to relinquish captaincy to focus and concentrate more on his game & has requested MS Dhoni to lead CSK. MS Dhoni has accepted to lead CSK in the larger interest & to allow Jadeja to focus on his game.
— Chennai Super Kings (@ChennaiIPL) April 30, 2022
ఐపీఎల్ 2022లో సీఎస్‌కే ఆడిన 8 మ్యాచ్‌లో 2 గెలిచి ప్లేఆఫ్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. ఇక నుంచి ఆడే ప్రతి మ్యాచ్ గెలిస్తేనే సీఎస్‌కేకు ప్లేఆఫ్ అవకాశం ఉంటుంది. కెప్టెన్సీ మారిన తర్వాత చెన్నై మునుపటి ఫామ్ అందుకుంటుందో లేదో చూడాలి. ఎంఎస్ ధోనీ నాయకత్వంలోనే చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన సంగతి తెలిసిందే. మొత్తానికి జడేజా నిర్ణయంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి మహీని సారథిగా చూడబోతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Snake Yoga Video: ప్రాణాయామం చేస్తున్న కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే కళ్లు బైర్లు కమ్మడం పక్కా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook