Anushka Sharma enjoys Virat Kohli First IPL 2022 Half Century: ఐపీఎల్ 2022లో వరుసగా విఫలమవుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ప్లేయర్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు తనదైన ఆటతో మెరిశాడు. శనివారం బ్రబౌర్న్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. మహమ్మద్ షమీ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్ మూడో బంతికి కోహ్లీ.. 46 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేశాడు. మొత్తంగా 53 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 58 పరుగులు చేశాడు.
ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2022లో తొలి అర్ధ శతకం బాదడంతో.. మైదనంలోని ఫాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. మైదానం మొత్తంను డాన్సులు, కేకలతో హోరెత్తించారు. కోహ్లీ.. కోహ్లీ అనే శబ్దంతో స్టేడియమంతా దద్దరిల్లిపోయింది. ఇక విరాట్ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ కూడా సంతోషం వ్యక్తం చేశారు. విరాట్ సింగల్ తీసి.. ఫిఫ్టీ పూర్తిచేయగానే లేచినిలబడి చప్పట్లు కొడుతూ ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు బెంగళూరు ప్లేయర్స్ కూడా డగౌట్ నుంచి ఎంకరేజ్ చేశారు.
అనుష్క శర్మ సంబరాలకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనుష్క, కోహ్లీ ఓ షాంఫూ యాడ్ షూటింగ్‌లో తొలిసారి కలుసుకుని స్నేహితులయ్యారు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఐదారేళ్లు ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు 2017 డిసెంబరులో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2021 జనవరి 11న కుమార్తె వామికాకు జన్మనిచ్చారు. పెళ్లి అనంతరం అనుష్కపూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. విరాట్ ఆడే ప్రతి మ్యాచుకు ఆమె హాజరవుతుంటారు.
— Diving Slip (@SlipDiving) April 30, 2022
ఐపీఎల్ టోర్నీలో 15 ఇన్నింగ్స్‌ల తర్వాత విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. మెగా టోర్నీలో అర్ధ శతకం బాదేందుకు కోహ్లీ ఎక్కువ ఇన్నింగ్స్‌లు తీసుకోవడం ఇది రెండోసారి. గతంలో 2009, 2010 సీజన్లలో 18 ఇన్నింగ్స్‌ల తర్వాత హాఫ్ సెంచరీ చేశాడు. అయితే ఐపీఎల్‌లో 50కి పైగా స్కోరు సాధించే క్రమంలో మూడోసారి అత్యంత తక్కువ స్ట్రైక్‌రేట్ నమోదు చేశాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో109.43 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడు 2017లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌పై 114.58 స్ట్రైక్‌రేట్, 2020లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 116.28 స్ట్రైక్‌రేట్‌తో రన్స్ చేశాడు.
Also Read: MS Dhoni CSK Captain: బ్రేకింగ్ న్యూస్.. చెన్నై కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook