Niharika - Lavanya Tripathi: నిహారిక గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి సంచలనం రేపింది. ఆ తర్వాత కథానాయికగా ఇరగదీసిందేమి లేదు. ఆ తర్వాత ఏదో కొన్ని చిత్రాల్లో నటించి తన లక్ ను పరీక్షించుకుంది. ప్రస్తుతం నిహారిక నిర్మాతగా రాణిస్తోంది. ఈ కోవలో పలు వెబ్ సిరీస్‌లు నిర్మించింది. ఆ మధ్య జొన్నలగడ్డ  చైతన్యను పెళ్లి చేసుకుంది. అప్పట్లో వీరి పెళ్లి రాజస్థాన్‌లో అట్టహాసంగా జరిగింది. కానీ ఆ తర్వాత ఎవరి దిష్టి తగిలిందేమో వీళ్ల పెళ్లి కొన్ని రోజుల్లోనే పెటాకులు అయింది. వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ సంగతి పక్కన పెడితే.. నిహారిక అన్న.. వరుణ్ తేజ్.. ప్రముఖ నటి లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు జస్టినేషన్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇక పెళ్లి సందర్భంగా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్‌కు ఇచ్చిన లాంఛనాలు అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయ్యాయి. తాజాగా పెళ్లి తర్వాత తన ఆడపడుచు నిహారికకు పెద్ద గిఫ్ట్ ఇచ్చిందట.


రీసెంట్‌గా నిహారికకు ఇదే క్వశ్చన్ కొంత మంది నుంచి ఎదురైంది. దీనికి నిహారిక కూడా అవును తన వదిన నుంచి తనకు  కొన్ని బహుమతులు వచ్చిన విషయాన్ని ప్రస్తావించింది. వాటి కంటే ఆమె నుంచి తనకు ప్రేమ, ఆప్యాయత, అభిమానం, అనే బహుమతులు వచ్చాయని ప్రస్తావించింది. ఇక లావణ్య త్రిపాఠి.. ముందుగా హిందీ సీరియల్స్ ద్వారా నటిగా అడుగు పెట్టి.. తెలుగులో అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్‌గా ప్రమోషన్ పొందింది. అంతేకాదు పులి మేక, మిస్ పర్ఫెక్ట్ వంటి వెబ్ సిరీస్‌లో నటించింది. ఇక వరుణ్ తేజ్‌తో కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో కలిసి నటించింది. ఇక పెళ్లి తర్వాత ఓ సినిమాలో వీళ్లిద్దరు జంటగా నటిస్తే చూడాలనుకునే అభిమానులున్నారు. అందులో నిహారిక కూడా ఓ కీలక పాత్రలో నటిస్తే అభిమానులకు అంతకంటే కావాల్సింది ఏం ముంది.


Also Read: Medaram Jathara 2024: భక్తులకు అలర్ట్‌.. మేడారం జాతరకు వెళ్తుంటే ఇవి మీ వెంట కచ్చితంగా ఉండాల్సిందే..!


Also Read: Lemon in Auction: వేలంలో రూ.1.5 లక్షలు పలికిన నిమ్మకాయ.. దాని స్పెషాలిటీ ఏంటో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712