Nithin meets CM Kcr: నితిన్ ఇవాళ ప్రగతి భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ని కలిశారు. హైద‌రాబాద్‌లో జూలై 26న రాత్రి 8:30 గంట‌ల‌కు జరగనున్న తన పెళ్లికి ( Nithin's wedding ) హాజరు కావాల్సిందిగా సీఎం కేసీఆర్‌ని ఆహ్వానిస్తూ.. తన వివాహ ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న కొవిడ్-19 వ్యాప్తి నివారణ నియమాలకు అనుగుణంగా ఈ పెళ్లి వేడుక నిర్వహించేందుకు నితిన్ కుటుంబం ఏర్పాట్లు చేస్తోంది.  (Also read: Oxford university's vaccine: కరోనావైరస్ వ్యాక్సిన్‌పై గుడ్ న్యూస్ వచ్చేసింది )



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనావైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా నితిన్, షాలినిల వివాహం ( Nithin's marriage with Shalini ) ఇదివరకే ఒకసారి వాయిదా పడిన సంగతి తెలిసిందే. దుబాయ్‌లోని ఓ రిసార్టులో ఏప్రిల్ 16న నితిన్, షాలినిల పెళ్లిని ఘనంగా జరిపించాలని ఇరు కుటుంబాలు భావించినప్పటికీ... కరోనావైరస్ ( Coronavirus ) కారణంగా అది సాధ్యపడలేదు. దీంతో ఈసారి హైదరాబాద్‌లోనే అతి కొద్దిమంది సన్నిహిత బంధు, మిత్రులు మధ్య ఈ పెళ్లి వేడుకను జరిపించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.  (Also read: ICC T20 World Cup 2020: ఐసిసి టీ20 వరల్డ్ కప్‌ వాయిదా )


నితిన్ సినిమా కెరీర్ విషయానికొస్తే... ప్రస్తుతం ఈ హీరో చేతిలో రంగ్ దే ( Rang de ), చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో మరో సినిమా ఉన్నాయి. వెంకి అట్లూరి డైరెక్ట్ చేసిన రంగ్ దే మూవీ త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రెండు చిత్రాల తర్వాత నితిన్ 'అంధాధున్' తెలుగు రీమేక్‌‌లో నటించనున్నాడు. మేర్ల‌పాక గాంధీ ఈ రీమేక్‌‌ని డైరెక్ట్ చేయనున్నాడు. ( Also read: Flash mob: బుట్టబొమ్మ పాటకు స్టెప్పేసిన ఇండిగో ఎయిర్‌లైన్స్ స్టాఫ్ )