ICC T20 World Cup 2020: ఐసిసి టీ20 వరల్డ్ కప్‌ వాయిదా

ఐసిసి టీ20 వరల్డ్ కప్‌ వాయిదా పడింది. కరోనావైరస్ వ్యాప్తి ( COVID-19 pandemic ) కారణంగా ఈ ఏడాది అక్టోబర్ 18 నుంచి ఆస్ట్రేలియాలో జరగాల్సి ఉన్న ఐసిసి టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్‌ని ( ICC T20 World Cup 2020 postponed ) వాయిదా వేస్తున్నట్టు ఐసిసి ప్రకటించింది.

Last Updated : Jul 20, 2020, 09:09 PM IST
ICC T20 World Cup 2020: ఐసిసి టీ20 వరల్డ్ కప్‌ వాయిదా

ఐసిసి టీ20 వరల్డ్ కప్‌ వాయిదా పడింది. కరోనావైరస్ వ్యాప్తి ( COVID-19 pandemic ) కారణంగా ఈ ఏడాది అక్టోబర్ 18 నుంచి ఆస్ట్రేలియాలో జరగాల్సి ఉన్న ఐసిసి టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్‌ని ( ICC T20 World Cup 2020 postponed ) వాయిదా వేస్తున్నట్టు ఐసిసి ప్రకటించింది. ఈమేరకు ఇవాళ జరిగిన ఐబిసి బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐసిసి టీ20 ప్రపంచ కప్‌‌ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన ఐసిసి.. రానున్న 3 ఐసిసి పురుషుల ప్రపంచ కప్స్‌కి సంబంధించిన షెడ్యూల్స్‌ని సైతం వెల్లడించింది. ( Also read: IPL 2020 : అబు దాబిలో ఐపిఎల్‌కి ఏర్పాట్లు )

ఐసిసి వెల్లడించిన వివరాల ప్రకారం 2021 టీ20 ప్రపంచ కప్ పోటీలు 2021 అక్టోబర్-నవంబర్ మధ్య నిర్వహిస్తారు. 2021 నవంబర్ 14న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 

2022 టీ20 ప్రపంచ కప్ పోటీలు 2022 అక్టోబర్-నవంబర్ మధ్య నిర్వహిస్తారు. 2022 నవంబర్ 13న ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్ చేశారు.

2023 టీ20 ప్రపంచ కప్ పోటీలు 2023 అక్టోబర్-నవంబర్ మధ్య నిర్వహించనున్నట్టు ఐసిసి స్పష్టంచేసింది. 2023 టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ని 2023 నవంబర్ 26న జరగనుంది. ( Also read: IPL 2020: ఐపిఎల్ 2020 నిర్వహణపై స్పందించిన న్యూజిలాండ్‌ )

ఐసిసి టీ20 పురుషుల కప్ 2020పై ఓ స్పష్టత రావడంతో ఐపిఎల్ నిర్వహణపై బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం పాటు టీ20 పురుషుల కప్ 2020 నిర్వహణపై ఐసిసి ఏం నిర్ణయం తీసుకుంటుందా అని బీసీసీఐ వేచిచూస్తోంది. ఐసిసి తీసుకునే నిర్ణయం ప్రకారం ఐపిఎల్ 2020ని ప్లాన్ చేసుకోవాలనేది బీసీసీఐ ప్లాన్. 

Trending News