Rang De movie release plans: నితిన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా 'రంగ్ దే' సినిమా విడుదలపై మూవీ యూనిట్ తర్బనభర్జనలు పడుతోంది. OTT ప్లాట్‌ఫామ్స్ నుంచి వస్తున్న ఆఫర్స్ అంగీకరించి సినిమాను వాళ్ల చేతుల్లో పెట్టాలా లేక తామే సొంతంగా ఆర్జీవీ ( Ramgopal Varma ) తరహాలో తమ సొంత వెబ్‌సైట్‌లో పే పర్ క్లిక్ ఫార్మాట్‌లో విడుదల చేయాలా అనే సందిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తోంది. Also read : Kiara Advani: రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తున్న హసీనా సాంగ్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెంకీ అట్లూరి దర్శకత్వం ( Venky Atluri ) వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలైంది. Rang de teaser కి ఆడియెన్స్ నుంచి భారీ స్పందన లభించింది. ప్రస్తుతం థియేటర్లు మూసివేయడంతో చాలా మంది ఇంట్లో కూర్చొని OTT ప్లాట్ ఫాంలలో సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. కానీ పే పర్ క్లిక్‌తో ( Pay per click ) చూడడానికి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఆడియెన్స్ ఈ సినిమాని చూడడానికి అంతగా ముందుకు వస్తారో లేదో అనే సందేహమే చిత్ర నిర్మాతలను కాస్త సందిగ్ధంలో పడేస్తోంది. తాము భయపడుతున్నట్టుగా అదేకానీ జరిగితే.. సినిమా ఎంత బాగున్నా.. సినిమాకు ఆడియెన్స్ నుంచి ఆధరణ కరువైతుందనే ఆందోళన నిర్మాతలను వెంటాడుతోందంట. Also read : Rakul Preet Singh: ఆ వార్తలను నిలువరించాలంటూ.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్



నితిన్ పెళ్లి ( Nithin wedding ) తర్వాత విడుదల కానున్న సినిమా ఇదే కావడంతో రంగ్ దే మూవీ నితిన్‌కి ఎంతో ప్రత్యేకం కానుంది. అందుకే ఈ సినిమాను తప్పకుండా సక్సెస్ చేసుకోవాలనే గట్టి భావన అందరిలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేద్దామని ప్లాన్ చేస్తున్న మేకర్స్.. అప్పటిలోగా పరిస్థితి మెరుగుపడితే.. వీలైతే సినిమాను థియేటర్లలోనే విడుదల చేయొచ్చనే ఆలోచన కూడా చేస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. Also read : Gangavva Funny Comments: మళ్లీ అరియానా గాలి తీసేసిన గంగవ్వ.. పగలబడి నవ్విన కంటెస్టెంట్స్


మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR