NTR 30 Shoot Starts From Febraury 2023: జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అని అందరిలో ఆసక్తి నెలకొంది. దానికి కారణం త్రివిక్రమ్ తో చేయాల్సిన సినిమా పక్కన పెట్టి మరీ కొరటాల శివతో తాను ఒక సినిమా చేస్తున్నానని ఎన్టీఆర్ ప్రకటించడమే. ఎన్టీఆర్ ప్రకటన అయితే చేశారు గానీ ఆర్ఆర్ఆర్ విడుదలైన ఆరు నెలలకు కూడా ఇంకా సరైన అప్డేట్ అయితే మూవీ టీమ్ నుంచి లభించలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అడపాదడపా సినిమా ఆగిపోతుందని వార్తలు రావడం, దాన్ని ఖండిస్తూ కొరటాల శివ అండ్ టీం కవర్ చేసుకునే ప్రయత్నాలు చేస్తూ రావడం తప్ప సినిమా నుంచి సరైన అప్డేట్ ఇప్పటివరకు రాలేదు. అయితే తాజాగా నూతన ఏడాది సందర్భంగా సినిమా యూనిట్ అధికారికంగా ఒక ప్రకటన చేసి నందమూరి అభిమానులందరినీ ఖుషీ చేసే ప్రయత్నం చేసింది. అసలు విషయం ఏమిటంటే ఫిబ్రవరి 202 లో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని ఏప్రిల్ 5 2024న సినిమా రిలీజ్ అవుతుందని పోస్టర్లో ప్రకటించారు.


అంతేకాక ధైర్యం అనేది ఒక జబ్బుగా మారితే భయం ఒక్కటే దానికి విరుగుడు అంటూ క్యాప్షన్ పెట్టడం కూడా ఇది ఒక ఫుల్ లెన్త్ మాస్ మసాలా మూవీ అని అర్థం అవుతోంది. ఇక పోస్టర్లో ఎన్టీఆర్ రెండు చేతులతో రెండు కత్తులు పట్టుకుని కనిపిస్తూ ఉండటం కూడా సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. ఇక ఈ సినిమాని యువసుధ ఆర్ట్స్ బ్యానర్ మీద సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తుండగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ మీద నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పిస్తూ ఉండగా ఆయన బావమరిది కొసరాజు హరికృష్ణ సహ నిర్మిస్తున్నారు.


ఇక రత్న వేలు డైరెక్టర్ ఆ ఫోటోగ్రఫీగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సబు సిరిల్ ఆర్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల చేస్తామని అనౌన్స్ చేయడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఎన్టీఆర్ దాదాపు రెండేళ్ల గ్యాప్ తీసుకున్నట్లు అవుతుంది. ఆర్ఆర్ఆర్ గత ఏడాది మార్చి నెలలో విడుదలైంది, ఇప్పుడు ఎన్టీఆర్ 30వ సినిమా వచ్చేయడాది ఏప్రిల్ 5వ తేదీన విడుదలవుతుంది.


అంటే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత రెండేళ్ల గ్యాప్ తో ఈ సినిమా రిలీజ్ అవుతూ ఉండడంతో అభిమానులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. అయితే సినిమా అసలు ఉంటుందా ఉండదా? ఉంటే ఏ సినిమా ఉంటుంది? అనే టెన్షన్ లేకుండా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు అంటూ వారు కొంతవరకు ఆనంద పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. చూడాలి మరి ఈ సినిమా టీమ్ నుంచి ముందు ముందు ఎలాంటి అప్డేట్స్ రాబోతున్నాయి అనేది.
Also Read: Ananya Panday Hot Photos: బ్యాంకాక్ లో పొట్టిబట్టల్లో రెచ్చిపోయిన అనన్య..అమితాబ్ మానవరాలితో కలిసి!


Also Read: AHA Video APP Crash: ప్రభాస్ ఫాన్స్ వల్లే యాప్ క్రాష్ అయిందా.. వెనుక ఉన్న అసలు నిజం ఏంటి?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook