Oscar Awards 2023: ఆస్కార్ వేడుక ఎన్ని గంటలకు ఎప్పుడు, లైవ్ స్ట్రీమింగ్ ఎందులో
Oscar Awards 2023: ఆస్కార్ పండుగ వచ్చేసింది. మరి కొద్దిగంటల్లో ఆస్కార్ అవార్డుల వేడుక ప్రారంభం కానుంది. ఈసారి పోటీలో తెలుగు సినిమా ఉండటంతో ఆసక్తి మరీ ఎక్కువైంది.
ప్రపంచ సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూసే ఆస్కార్ పండుగ మరి కొద్దిగంటల్లో ప్రారంభం కానుంది. లాస్ ఏంజిల్స్‌లోని డోల్బీ థియేటర్ వేదికగా ప్రారంభం కానున్న ఆస్కార్ వేడుక ప్రత్యక్ష ప్రసారానికి వేదికలు సిద్ధమయ్యాయి. లైవ్ స్ట్రీమింగ్ ఎందులోనంటే..
భారత కాలమానం ప్రకారం మార్చ్ 13 ఉదయం 5.30 గంటల నుంచి ఆస్కార్ వేడుక ప్రారంభం కానుంది. లాస్ ఏంజిల్స్‌లోని డోల్బీ థియేటర్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈసారి బరిలో తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ ఉండటంతో భారతీయులకు ముఖ్యంగా తెలుగు ప్రజలకు ఆసక్తి ఎక్కువైంది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట తుది నామినేషన్లలో నిలవడంతో ఆందరికీ ఆసక్తి పెరిగింది.
ఇండియాలో స్ట్రీమింగ్ ఎందులో
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ఏబీసీ నెట్‌వర్క్ యూట్యూబ్, Hulu Live TV, Direct TV, FUBO TV, AT&T TVలో ఆస్కార్ అవార్డుల వేడుకను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు. ఇందులో కొన్నింటికి సబ్‌స్క్రిప్షన్ అవసరమౌతుంది. వీటితో పాటు ABC.COM, ABC Appలో కూడా వీక్షించవచ్చు.
నాటు నాటుతో పోటీలో ఉన్నవి
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగరీ తుది నామినేషన్‌లో నిలిచింది. Applause( Tell it like a woman),Hold My Hand( Top Gun Maverick),Lift Me Up( Black Pather Wakanda Forever),This is a life( Everything Everywhere all at once) పాటలు నాటు నాటు పాటతో పోటీలో ఉన్నాయి.
ఆస్కార్ 2023 ఆతిధ్యం ఇచ్చేది ఎవరు
గత ఏడాది అంటే 2022 ఆస్కార్ అవార్డు వేడుకకు రెజీనా హాల్, యామీ స్కూమర్, వాండా స్కైక్స్ ఆతిధ్యమిచ్చారు. ఈసారి మాత్రం సింగిల్ హోస్ట్ ఉంటుంది. ప్రముఖ కమెడియన్ జిమ్మీ కిమ్మెల్ ఆతిధ్యమివ్వనున్నారు. ఆస్కార్ ప్రజెంటర్స్‌లో మైకేల్ బి జోర్డాన్, హాల్లే బెర్రీ, హారిసన్ ఫోర్డ్, పెడ్రో పాస్కల్, ఫ్లోరెన్స్ పఫ్, యాండ్రూ గార్ ఫీల్డ్, కేట్ హడ్సన్, లిటిల్ మెర్మెయిడ్ ఉన్నారు.
Also read: Oscar Awards 2023: ఆస్కార్ వేడుకలో ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ, ఓటేసిన హీరో సూర్య, ఎవరికో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook