Oscar Awards 2024: ఆస్కార్ అవార్డు విజేతకు ఇచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..
Oscar Awards 2024: వరల్డ్ వైడ్‌గా ఎక్కువ మంది సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూసే అవార్డుల్లో ఆస్కార్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. హాలీవుడ్ సహా ప్రతి ఒక్క ఇండస్ట్రీకి చెందిన వారు ఈ అవార్డు అందుకోవాలని కలలు గంటూ ఉంటారు. ఈ సారి 96వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఇక అవార్డు సందర్భంగా ఇచ్చే ప్రైజ్ మనీ ఎంత అనేది తెలిస్తే మైండ్ బ్లాంక్ కావాల్సిందే.
Oscar Awards 2024: 96వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఉన్న డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈసారి మన దేశం తరుపున ఏది నామినేషన్ దక్కించుకోలేదు. గతేడాది ఆర్ఆర్ఆర్, ఎలిఫెంట్ విస్పర్స్ అకాడమీ అవార్డులు గెలుచుకొని భారతీయులను తల ఎత్తుకునేలా చేసింది. ఆ సంగతి పక్కన పెడితే.. 96వ ఆస్కార్ అవార్డుల్లో ఓపెన్ హైమర్ మూవీ అత్యధిక అవార్డులను కొల్లగొట్టింది.
ఇది అలా ఉంటే సినీ ప్రపంచంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు గెలిచిన వారికి ఎంత డబ్బును ప్రైజ్‌గా ఇస్తారనేది హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయమై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ఆస్కార్ అవార్డు విజేతలకు అకాడమీ వాళ్లు ఒక్క పైసా కూడా ఇవ్వరు. ఆస్కార్ అవార్డు గెలుచుకోవడమే పెద్ద అఛీవ్‌మెంట్. అది కొన్ని వేల కోట్లతో సమానం. అయితే ఆస్కార్ విజేతలకు ట్రోఫీ తప్ప నగదు బహుమతి ఉండదు. అయితే విజేతలు గెలుచుకున్న ట్రోఫీని ఎవరికైనా అమ్మితే చట్టపరమైన చర్యలు ఎదుర్కొవాల్సిందే. ఒకవేళ దొంగతనం అయితే.. ముందుగా పోలీస్ కంప్లైంట్ చేసిన ఎఫ్ ఐ ఆర్ కాపీని ఆస్కార్ వాళ్లకు పంపితే కొత్తది చేసి ఆయా విజేతలకు పంపుతారు.
ఆస్కార్ అవార్డులను ముందుగా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (Acedemeby of Motion Picture arts and sciences) అందించే ట్రోఫీని ముందుగా అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్‌గా పిలిచేవారు. ఆ తర్వాత ఆస్కార్ పేరు స్థిరపడింది. ఇక ఈ అవార్డు మొదలు పెట్టినపుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనచేసిన మార్గరెట్ హెర్రిక్.. ఈ అకాడమీ ట్రోఫీ తన అంకుల్‌లా ఉందనే కామెంట్స్ చేసారు. ఆ తర్వాత ప్రఖ్యాత హాలీవుడ్ జర్నలిస్ట్ తన రాసే వ్యాసంలో అకాడమీ అందించే ట్రోఫీని ఆస్కార్‌గా రాసాడు. అప్పటి నుంచి అకాడమీ అవార్డులకు ఆస్కార్ పేరు స్థిరపడిపోయింది.
ఈ అవార్డులు 1929లో ప్రారంభమయ్యాయి. తాజాగా 96వ ఆస్కార్ అవార్డులు ప్రధానోత్సవం జరుగుతోంది. తొలిసారి ఈ వేడుకలకు 270 పైగా అతిథులు హాజరయ్యారు. 1953 నుంచి ఈ అవార్డులను ప్రత్యక్ష ప్రసారం అనేది ప్రారంభమైంది. ప్రెజెంట్ 200పైగా దేశ ప్రజలు ఈ అవార్డుల కార్యక్రమాన్ని వీక్షించేందకు ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. తాజాగా జరిగిన 94వ అకాడమీ అవార్డుల్లో ఓపెన్ హైమర్ మూవీ అత్యధిక అవార్డులు గెలుచుకుంది.
Also Read: AP Politics: వైసీపీలోకి ముద్రగడ పద్మనాభం.. ప్రతిపక్షాలకు షాక్.. జగన్‌కు బూస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook