Oscar winner Chandra Bose: సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవ సంబరాలను నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో గ్రాండ్ సెంటర్‌లో భారీ ఎత్తున నిర్వహించారు. ఈ ఉత్సవానికి డల్లాస్ నగరంలోని ప్రముఖులు, టాలీవుడ్ తారలు అతిథులు హాజరై సందడి చేశారు. ఈ వార్షిక వేడుకల్లో సుస్వర మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలు మీనాక్షి అనిపిండి తన శిష్య బృందంతో 7 సిగ్మెంట్లలో దాదాపు 30కి పైగా సంప్రదాయ సంగీత కీర్తనలను ప్రదర్శన ఇచ్చి.. అందరినీ ఆకట్టుకున్నారు. 10 గంటల పాటు నిర్విరామంగా సాగిన ఈ సాంస్కృతిక గాన ప్రదర్శన వీక్షకులను కట్టిపాడేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Revanth Reddy: శిష్యుడు ఎవరు? గురువు ఎవరు? చంద్రబాబుపై రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు


ఈ సందర్భంగా వేదికపై ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ విన్నర్ చంద్రబోస్‌ను 'సుస్వర సాహిత్య కళానిధి' అనే బిరుదును అందజేసి సత్కరించారు. చంద్ర‌బోస్ త‌న సొంత గ్రామం చల్లగరిగెలో తలపెట్టిన ఆస్కార్ గ్రంథాల‌య నిర్మాణానికి ఈ కార్య‌క్ర‌మం ద్వారా 15 వేల డాల‌ర్స్‌ పైగా విరాళం రావ‌డం విశేషం. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ త‌న మాట‌లు, పాట‌ల‌తో అల‌రించారు. పట్నాయక్‌ను 'సుస్వర నాద‌నిధి' అనే బిరుదుతో మీనాక్షి అనిపిండి సత్కారం చేశారు. 


డల్లాస్ నగరంలో శాస్త్రీయ సంగీత  శిక్షకురాలి డాక్టర్ మీనాక్షి అనుపిండి ఉన్నారు. సుస్వర మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. దాదాపు 21 ఏళ్లుగా ఆమె సుస్వర మ్యూజిక్ అకాడమీ పేరిట ప్రతి సంవత్సరం వార్షికోత్సవ సంబరాలను నిర్వహిస్తున్నారు. మే 5వ తేదీన జరిగిన ఈ వేడుకలకు తానా ప్రపంచ సాహిత్య వేదిక చైర్మన్ ప్రసాద్ తోటకూర, డల్లాస్‌లో ఇండో అమెరికన్ కౌన్సిల్ సభ్యులు గోపాల్ పోనంగి, ప్రముఖ వ్యాపారవేత్త కిషోర్ కంచర్ల తదిరుతు అతిథులు హాజరయ్యారు. టాలీవుడ్ డైరెక్ట‌ర్ వీఎన్‌ ఆదిత్య‌ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. 


Also Read: Rashmi Gautam: ట్రోలర్ కి రష్మీ షాకింగ్ రిప్లై.. రేపు నీ పిల్లలని చంపుతాడు జాగ్రత్త



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter