Revanth Reddy Chandrababu: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో విస్తృత పర్యటన చేస్తున్న రేవంత్ రెడ్డి ఇదే క్రమంలో వరుసగా మీడియాతో ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇదే వరుసలో ఓ ప్రధాన చానల్‌తో మాట్లాడుతున్న సమయంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా ఫేక్ వీడియో కేసు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతోపాటు మరికొన్ని అంశాలపై మాట్లాడారు. చర్చలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. వారిద్దరి విషయంలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆ ఇంటర్వ్యూ వేదికగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు వైరల్‌గా మారాయి. చంద్రబాబు ఎవరయ్యా? అని కొంత ఆవేశంతో చేసిన వ్యాఖ్యలు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబుపై దురుసు వ్యాఖ్యలు చేసిన రేవంత్‌పై ఏపీలో టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో వైఎస్ షర్మిలను ఏపీకి ముఖ్యమంత్రి చేసేందుకు పని చేస్తానని ప్రకటించారు.
Also Read: Singanamala: ప్రచారంలో ఎండదెబ్బ.. మంచానికి పరిమితమైన శింగనమల టీడీపీ అభ్యర్థి
ఇంటర్వ్యూలో భాగంగా ఓ విలేకరి గురువుగారైన చంద్రబాబుకు ఏపీలో సహకరిస్తారా? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రేవంత్ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 'గురువు ఎవరయ్యా? గురువెవరు? అంటూ విరుచుకుపడ్డారు. 'గురువు గారు అక్కడ పోటీ చేస్తున్నారు. మరి గురువు గారికి శిష్యుడు ఏమైనా సహకరిస్తారా? అని మీడియా ప్రశ్నించింది. 'ఎవడయ్య బుర్రలేనివాడు మాట్లాడేది. శిష్యుడు ఎవరు? గురువెవరు? నేను సహచరుడినని చెప్పిన. ఎవడైనా బుద్దిలేని గాడిద కొడుకు శిష్యుడు గురువు అని మాట్లాడితే ముడ్డి మీద పెట్టి తంతా' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
షర్మిల సీఎం
ఏపీలో చంద్రబాబుకు ఎందుకు సహకరిస్తామయ్య? అని రేవంత్ ఎదురు ప్రశ్నించారు. సహకరిస్తే మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు సహకరిస్తాం. ఆమెకు మద్దతుగా ఏపీలో ప్రచారం చేస్తాం. ఇప్పటికే విశాఖపట్టణంలో షర్మిలకు మద్దతుగా ప్రచారం చేశా. కావాల్సి వస్తే షర్మిలను ముఖ్యమంత్రి చేసేందుకు ప్రయత్నిస్తా' అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter